తెలంగాణ

ఆర్టీసీపై నిర్బంధ కాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: ఆర్టీసీ ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధ కాండ, అక్రమ అరెస్టులపై సీపీఐ నేతలు భగ్గుమన్నారు. కార్మికులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేపట్టిన నిరవధిక దీక్షను ఆదివారం రాత్రి పోలీసులు భగ్నం చేసి, అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సీపీఐ హైదరాబాద్ సమితి ఆధ్వర్యంలో మంగళవారం చలో డీజీపీ ఆఫీసు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో హయత్‌నగర్‌లోని పార్టీ కార్యాలయం ముందు భారీగా పోలీసులు మోహరించి నేతలను అడ్డుకున్నారు. అయినా పోలీసుల వలయాన్ని ఛేదించి వందలాది పార్టీ కార్యకర్తలు బ్లాక్ టీ షర్టులు, మహిళలు నల్లని చీరలు ధరించి ర్యాలీగా డీజీపీ ఆఫీసుకు వెళ్లారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, హైదరాబాద్ కార్యదర్శి ఈటీ నర్సింహ తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ శాంతియుతంగా నిరవధిక దీక్ష చేస్తున్న కూనంనేనిని అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని అన్నారు. 25 రోజుల నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే కేసీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని అన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం కొట్లాడిన సీపీఐ ఆఫీసుపై అర్ధరాత్రి దొంగచాటుగా చొరబడి శిబిరంపై దాడి చేసి కూనంనేనిని అరెస్టు చేశారని అన్నారు. ఈటీ నర్సింహ మాట్లాడుతూ పొలీసులు మోహరించినా ర్యాలీకి అడ్డుపడినా డీజీపీ ఆఫీసును ముట్టిడించి తీరుతామని పేర్కొన్నారు. రోడ్డుపై సీపీఐ నేతలు బైఠాయించగా అక్కడున్న ఉన్నతాధికారులు డీజీపీ కార్యాలయంతో మాట్లాడి కొద్ది మంది నేతలను డీజీపీని కలిసేందుకు అనుమతించారు. కూనంనేని ఘటనపై విచారణ జరిపించి, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చూస్తామని డీజీపీ హామీ ఇచ్చారని సీపీఐ నేతలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఛాయాదేవి, మారుపాక అనిల్‌కుమార్, ఆర్‌ఎన్ శంకర్, వీఎస్ బోస్, సృజన, జ్యోతి, సదాలక్ష్మీ, వలీ ఉల్లాఖాద్రీ, రాకేశ్ సింగ్, నెర్లకంటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న సీపీఐ నేతలు, కార్యకర్తలు