తెలంగాణ

కార్మికుల ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె కారణంగా ఇప్పటివరకు 15మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ నాయకుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. ఆయన సరూర్‌నగర్‌లో నిర్వహిస్తున్న ఆర్టీసీ ‘సకల జనభేరీ’ సభలో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. స్వీయ క్రమశిక్షణ పేరుతో 48వేల మంది కార్మికులను మనోవేదనకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ ఆర్టీసీపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆర్టీసీ ఉద్యమానికి అన్ని పార్టీలు అండగా ఉండాలని కోరారు.