తెలంగాణ

ఇలా వాదించండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైకోర్టుకు ప్రభుత్వం తరఫున నివేదించే అంశాలపై ప్రగతిభవన్‌లో బుధవారం సీఎం చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున హైకోర్టు లేవనెత్తిన అంశాలకు ఇవ్వాల్సిన సమాధానాలపై అధికారు లు, న్యాయాధికారులతో సీఎం చర్చించారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో జరుగుతున్న విచారణను నవంబర్ ఒకటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. దాదాపు హైకోర్టులో ఈ అంశంపై విచారణ పూర్తి కావడంతో ఆ రోజు తీర్పు వెలువడనుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆర్టీసీని కొన్ని అంశాలపై హైకోర్టు నివేదిక కోరగా వాటిని గురువారం సమర్పించనుంది. ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు, ఇప్పటి వరకు చేసిన చెల్లింపులు, ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయంగా చేసిన ఏర్పాట్లు, జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన డబ్బులు, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, వీటిలో ఆర్థికేతర డిమాండ్లతో పాటు హైకోర్టు ప్రధానం గా ప్రస్తావిస్తున్న అంశాలపై ఏ విధమైన సమాధానాలు ఇవ్వాలన్నది అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.