తెలంగాణ

ఖరీఫ్‌లో కోటి మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఖరీఫ్‌లో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయనునున్న నేపథ్యంలో ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లు చేసింది. గడిచిన ఐదు సంవత్సరాలలో ధాన్యం కొనుగోళ్లు 318 శాతం పెరిగినట్టు అవుతుంది. ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అవుతుండటంతో కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పౌరసఫరాల శాఖ పకడ్బంది చర్యలు చేపట్టింది. ఇందుకుగాను గత ఏడాది రూపొందించిన ధాన్యం కొనుగోళు విధానంలో పలు మార్పులు చేసింది. ముఖ్యంగా ధాన్యం విక్రయంలో రైతులకు అవగాహన కల్పించడంతో పాటు నాణ్యతపై రాజీ పడవద్దని వ్యవసాయ మార్కెటింగ్ శాఖను అప్రమత్తం చేసింది. క్షేత్రస్థాయిలో ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒకరి చొప్పున వ్యవసాయ విస్తరణ అధికారిని ఇంచార్జీగా నియమించింది. అలాగే ధాన్యం కోనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తోంది. ధాన్యం సేకరణకు తొలిసారి రాష్టస్థ్రాయి సమన్వయ కమిటీకి పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. రైతు సమస్యలు, కనీస మద్దతు ధర తదితర ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయి సమన్వయ కమిటీల్లో లీడ్ బ్యాంక్ మేనేజర్, కార్మిక శాఖ, పోలీసు శాఖలకు ప్రాతినిధ్యం కల్పించింది. ఖరీఫ్ సీజన్‌లో 60 లక్షల మెట్రిక్ టన్నులు, రబీలో 40 లక్షల మెట్రిక్ టన్నులు కలిపి కోటి మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా ఉండగా పౌర సరఫరాలశాఖ కమిషనర్‌గా పని చేసిన అకున్ సభర్వాల్ కేంద్ర సర్వీస్‌లోకి వెళ్తుండటంతో ఆయనకు పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సంస్థ ఉద్యోగులు ఘనంగా సన్నానించి వీడ్కోలు పలికారు.
తాను పౌర సరఫరాల కమిషనర్‌గా పని చేసిన 17 నెలల కాలం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, సీఎం కేసీఆర్ ప్రోద్బలంతో బాగా పని చేయగలిగానని అకున్ సభర్వాల్ అన్నారు.