తెలంగాణ

విదేశీ వర్శిటీల్లో ప్రవేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: విదేశీ వర్శిటీల్లో ప్రవేశాలకు తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేక డ్రైవ్‌ను నవంబర్ 2వ తేదీన నిర్వహిస్తున్నట్టు ఇండియా మ్యాటర్స్ ఫౌండేషన్ అధిపతి విజయకుమార్ నాయర్ తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని లెమన్‌ట్రీ హోటల్‌లో ఈ స్పెషల్ డ్రైవ్ ఉంటుందని ఆయన చెప్పారు. ఆసక్తి ఉన్న వారు అడ్మిషన్ ఆఫీసర్‌ను కలుసుకోవాలని సూచించారు. ప్రధానంగా అమెరికాలోని అడెల్ఫి యూనివర్శిటీ, అమెరికన్ యూనివర్శిటీ, అప్లయి బోర్డు, అర్కాన్సస్ స్టేట్ యూనివర్శిటీ, అబర్న్ యూనివర్శిటీ, స్విట్జర్లాండ్ బిజినెస్ అండ్ హోటల్ మేనేజిమెంట్ స్కూల్, కేప్ బ్రెటన్ యూనివర్శిటీ (కెనడా), కాలేజీ డీ పారిస్ (ఫ్రాన్స్), గ్లాస్గో యూనివర్శిటీ, గ్రిఫిత్ కాలేజీ (ఐర్లాండ్), దుబై హెరియట్ వాట్ యూనివర్శిటీ, లా రాచెల్ ఫ్రాన్స్ సహా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, నెదర్లాండ్, ఐర్లాండ్ తదితర దేశాల యూనివర్శిటీల అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు చెప్పారు.