తెలంగాణ

రాష్ట్రానికి మణిహారం కేబుల్ బ్రిడ్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రానికే మణిహారంగా కరీంనగర్ మానేరు వాగుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణమతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం తీగల వంతెన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ 220 మీటర్ల ఎత్తులో రెండు పైలాన్ పిల్లర్లతో నాలుగు వరుసల రహదారుల నిర్మాణాలు శరవేగంతో అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయన్నారు. తీగల వంతెన నిర్మాణానికి రూ.128 కోట్లు ఖర్చు అవుతుందని, అప్రోచ్ రోడ్లతో కలుపుకొని రూ.187 కోట్ల వ్యయం అవుతుందన్నారు. మానేరు రివర్ ఫ్రంట్, కేసీఆర్ ఐలాండ్ కనువిందు చేయనుందన్నారు. రూ.7 కోట్లతో చైనా-తైవాన్ డైమెన్షన్ లైటింగ్ ఏర్పాటుతోపాటు కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అమిత ప్రేమ చూపిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరంతో కరీంనగర్‌ను అభివృద్ధిపర్చాలనేది కేసీఆర్, కేటీఆర్ సదాశయమని అన్నారు. కరీంనగర్ జిల్లాపై ఉన్న ప్రేమతోనే తీగల వంతెన, రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద ఐటీ టవర్స్, మానేరు రివర్ ఫ్రంట్ మంజూరు చేశారని తెలిపారు. తీగల వంతెన పనులు శరవేగంతో జరుగుతున్నాయని, 20-ట్వంటీ మార్చి చివరికల్లా పనులు పూర్తవుతాయన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల పనులు కొంత కుంటుపడ్డాయని, మళ్లీ వేగం పుంజుకుందన్నారు. తీగల వంతెన పూర్తయితే కరీంనగర్ నడిబొడ్డున గల కమాన్ నుంచి మానకొండూర్ వరకు ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సులభతరమవుతుందన్నారు. సుమారు 70 సెగ్మెంట్లు అవసరం కాగా, ఇప్పటికే 22 సెగ్మెంట్లను అమర్చారని, ఒక్కో సెగ్మెంట్ 120 టన్నుల బరువు ఉంటుందని, 220 మీటర్ల ఎత్తుతో ఉన్న రెండు పైలాన్ పిల్లర్లపై వంతెన నిర్మితమవుతుందని అన్నారు. వంతెనపై నాలుగు వరుసల రహదారి పాదచారులు నడిచేందుకు ఐదు ఫీట్ల వెడల్పుతో తోవ ఉంటుందన్నారు. వంతెన మధ్య నుంచి తీగెలుంటాయని, టాటా ప్రాజెక్టు కంపెనీ, టర్కీకి చెందిన గులేమార్ కంపెనీలు సంయుక్తంగా ఈ నిర్మాణాలు చేస్తున్నాయని తెలిపారు. తీగల వంతెన నిర్మాణానికి రూ.128 కోట్ల ఖర్చవుతుందని, అప్రోచ్ రోడ్లతో కలుపుకొని రూ.187కోట్ల వ్యయం అవుతుందన్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ చేరగానే ఎడమవైపునకు ఐటీ టవర్స్, తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్, కేసీఆర్ ఐలాండ్ కనువిందు చేయనున్నాయని వివరించారు. దీంతో పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని, రెండు పైలాన్‌ల మధ్య 18 ఫిట్ల ఎత్తుతో సిమెంట్ గోడలు నిర్మిస్తామని, డ్యాం నుంచి 10 కిలోమీటర్ల మేర నీటి నిలువ ఉంటుందని, ఇందులో వాటర్ స్పోర్ట్స్, రెస్టారెంట్, బోటింగ్, జెట్ స్కీలు, లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయన్నారు. చైనా-తైవాన్‌ల సాంకేతికతతో తీగెల వంతెనపై డైమెన్షన్ లైటింగ్ ఉంటుందని, ఇందుకోసం రూ.7 కోట్లు ఖర్చవుతాయని, తీగెల వంతెన రాత్రివేళల్లో కూడా అద్భుతంగా కనబడుతుందని అన్నారు.
కేసీఆర్ ఐలాండ్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని, ఇందుకోసం జి.ఓ.నం.710 ద్వారా రూ.5 కోట్లు మంజూరయ్యాయని, నిరుద్యోగం తగ్గించేందుకు జిల్లాకు పరిశ్రమ తీసుకువస్తామని, రక్తం దారపోసైనా జిల్లాను అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు అంకితభావంతో కృషి చేస్తానని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఆర్ అండ్ బీ ఈఈ వెంకటరమణ, మాజీ కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
*చిత్రం...తెలంగాణ మణిహారం తీగెల వంతెన పనులను పరిశీలిస్తున్న మంత్రి గంగుల