తెలంగాణ

అంతిమ సంస్కారానికి.. 16 కిలోమీటర్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరంగాపురం, అక్టోబర్ 31: బతికుండగా ఉండటానికి ఎలాగూ సొంత ఆవాసం లేదు.. కనీసం చచ్చిన తర్వాతైనా అంతిమ సంస్కారాలు చేయడానికి ఆరడుగుల నేల కూడా లేని దుస్థితి వారిది. ఆ గ్రామంలో ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాలకు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దైన్యం తమదని వారు వాపోతున్నారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల పరిధిలోని నాగరాల గ్రామం శ్రీరంగసముద్రం బ్యాక్ వాటర్ వల్ల ముంపునకు గురి కావడంతో గ్రామాలలో వౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే దహన సంస్కారం చేయడానికి శ్మశానవాటిక లేకపోవడంతో కిలోమీటర్ల దూరం మృతదేహాన్ని పట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. గురువారం నాగరాల గ్రామానికి చెందిన సాయులు(60) మరణించగా శ్మశానవాటిక లేకపోవడంతో గ్రామం నుండి రంగసముద్రం బ్యాక్ వాటర్ నీటిలోనే మృతదేహాన్ని మోసుకుంటూ సుమారు 16 కిలో మీటర్ల దూరం తీసుకువెళ్లి అక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బ్యాక్ వాటర్ వల్ల నిత్యం తమ గ్రామం మునుగుతుందని, గ్రామ ప్రజలకు ప్రభుత్వం కల్పించాల్సిన వౌలిక వసతులు అందిస్తే గ్రామాన్ని వదిలి వెళ్తామని అన్నారు. తమకు ఇప్పటివరకు కొంతపరిహారం మాత్రమే అందించారని, అందించాల్సిన పరిహారం పూర్తిగా అందించకపోతే ఇకపై మృతదేహంతో జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.