తెలంగాణ

సమ్మెపై సర్కారు చర్చలు జరిపితేనే.. ‘బాబు’ అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: హైదరాబాద్‌లో జరిగిన సకల జనుల సమరభేరి సభకు బుధవారం హాజరై గుండెపోటుతో మృతి చెందిన కరీంనగర్ 2-డిపో డ్రైవర్ ఎన్.బాబు మృతదేహం గురువారం కరీంనగర్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో అఖిలపక్షాలు బంద్‌కు పిలుపునివ్వడం, దీంతో అగ్గి రాజుకొని ఆర్టీసీ కార్మికుల, అఖిలపక్షాల ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఇక చావో రేవో తేల్చుకొనేందుకు బాబు ఇల్లు వేదికైంది. తమకు స్పష్టమైన హామీ వచ్చే వరకు మృతదేహాన్ని కదలనీయమంటూ భీష్మించుకు కూర్చున్నారు. రాత్రి 11 గంటలైనా మృతదేహాన్ని అలాగే ఉంచారు. అయతే భారీయెత్తున పోలీసులు సైతం మోహరించారు. మృతదేహాన్ని తరలిస్తే తాము సైతం ఆత్మహత్య చేసుకుని మరణిస్తామని బాధితుని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. 27 రోజులు ప్రశాంతంగా సాగిన సమ్మెకు ప్రభుత్వం దిగి రాకపోగా ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు.. వారి ఉద్యోగాలు వారే వదులుకున్నారు..సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం నేతల్లో అసహనం కట్టలు తెంచుకుంది. బాబు మరణం కరీంనగర్‌లో కల్లోలం రేపింది. రోజుకో చోట కార్మికులు కలత చెంది మృతిచెందడం జీర్ణించుకోలేక కార్మికులు, అన్ని పార్టీలు ఏకమయ్యారు. బాబు ఇంటి వద్ద భారీ పోలీస్ బలగాలు మోహరించారు. కార్మికుల, అఖిలపక్షాల ఆందోళనలు ఉధృతం కాకుండా ఎక్కడికక్కడే కట్టడి చేశారు. అప్పటివరకు ఇక్కడి నుండి మృతదేహం కదలనీయకుండా అడ్డు తగలడం ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ కార్మికులకిదే ఆఖరి చావు కావాలని, చర్చలు జరిపే వరకు శవాన్ని కదలనిచ్చేది లేదంటూ ఎంపీ బండి సంజయ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ, టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, యువజన విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు భీష్మించుకున్నారు. బాబు మృతదేహంతోనైనా ప్రభుత్వం కదిలి రావాల్సిందేనని పట్టుబడుతూనే ఉన్నారు. దీంతో భారీ పోలీస్ బలగాలు మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఉద్రిక్త పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగనుందోననే ఆందోళన మొదలైంది. బలవంతంగా బాబు మృతదేహాన్ని కదలించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ వేదిక కరీంనగర్ మరోసారి ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి ఆహుతైన బాబు మృతి మరో కల్లోల వేదికకు తెరతీస్తోంది. మృతదేహం చేరుకొని 12 గంటలు గడుస్తున్నా ప్రభుత్వంనుంచి ఎలాంటి స్పందన కనబడకపోవడం విచారకరమని, బాబు హఠాన్మరణంతోనైనా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగేవరకు మృతదేహాన్ని కదలనివ్వమంటూ, ఆర్టీసీ కార్మికుల ఆఖరి చావు ఇదే కావాలని, శుక్రవారం కూడా నగర బంద్‌కు అఖిల పక్షాలు పిలుపును ఇచ్చాయి. బాబు మృతిపై కేసీఆర్ సర్‌‘కారు’ నిర్లక్ష్యవైఖరి నిరసిస్తూ ఇచ్చిన బంద్‌కు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని పిలుపునిస్తూనే గురువారం బాబు భౌతికఖాయం వద్ద బైఠాయించారు. శాంతియుతంగా జరిగే బంద్‌ను కట్టడి చేసేందుకు పోలీసులు యత్నిస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అఖిల పక్ష నాయకులు హెచ్చరిస్తున్నారు.
*ఆర్టీసీ డ్రైవర్ బాబు భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న నాయకులు.
*బాబు ఇంటి ఎదుట భారీగా పోలీస్ బలగాల మోహరింపు.
*భౌతికకాయం వద్ద విలపిస్తున్న బాబు కుటుంబ సభ్యులు.