తెలంగాణ

యోగాతో ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. మహిళలు యోగా నేర్చుకోవాలని ఆమె కోరారు. నడవడం కంటే పరుగెత్తం, వేగంగా నడవడం అలవాటు చేసుకోవాలన్నారు. తెలంగాణలో మహిళలు సంప్రదాయ పద్థతుల్లో ఆత్మగౌరవంతో హుందాగా ఉంటారని, తమిళ, తెలంగాణ సంస్కృతుల మధ్య పెద్ద వ్యత్యాసం కనపడదని ఆమె అన్నారు. తాను త్వరలోనే తెలుగు నేర్చుకుని మాట్లాడుతానని ఆమె చెప్పారు. గురువారం ఇక్కడ ఆమె ముషీరాబాద్‌లో జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు విలువైన కాలాన్ని వృథా చేసుకోరాదన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ప్రతిరోజూ యోగా, వ్యాయామం చేస్తారన్నారు. ప్రధానికి సమయం దొరికితే మనకు లభించదా, వీలు చూసుకుని ప్రతి రోజూ వ్యాయామానికి సమయాన్ని కేటాయించాలన్నారు. తాను సాధారణ మహిళ, డాక్టర్ అని, వైద్యురాలిగా మంచి ప్రాక్టీసు చేశానని ఆమె చచెప్పారు. మహిళలకు వస్త్రాలు, ఆభరణాలు ఎంత ముఖ్యమో, ఆరోగ్యమూ అంత ప్రధానమన్నారు. మనకు ఇష్టమైన వాటికి సమయం కేటాయిస్తామని, ఆరోగ్య పరిరక్షణ వచ్చేసరికి నిర్లక్ష్యంగా ఉంటామన్నారు. మహిళలు ప్రతి రంగంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా స్వీకరించి ముందుకెళ్లాలన్నారు. ఇష్టమైన రంగాన్ని ఎన్నుకుని నైపుణ్యాన్ని సాధించాలన్నారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ లాంటి సృజనాత్మకత కళల పట్ల మహిళలు శ్రద్ధ పెట్టి నేర్చుకోవాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ మహిళల సాధికారత, ముద్ర రుణాల వల్ల మహిళల జీవితాల్లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పు, మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంక్షేమ పథకాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలకు గవర్నర్ ధృవపత్రాలను ప్రదానం చేశారు.