తెలంగాణ

బాలల సంక్షేమానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: రాష్ట్రంలోని బాలల హక్కులు, సంక్షేమం కోసం ఎంతవరకు వెళ్లి అయినా పనిచేస్తుందన్న నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపైన ఉందని గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బాలల హక్కుల సంరక్షణ రాష్ట్ర కమిషన్ నూతనంగా ఏర్పాటైన సందర్భంగా శుక్రవారం ఇక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయిల సమావేశంలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని , బాలలు, మహిళలకు ఎలాంటి లోటు ఉండకుంటడా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారవు. ఇందులో భాగంగా జోగిన పల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల పిల్లలకు కచ్చితంగా మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో చాలా మంది బాలలు విధి వంచితులుగా ఉన్నారని, వారు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన చెందారు. వారి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మనకు ఉందని, బాలలకు మనమంతా తోడుగా ఉన్నామన్న నమ్మకం కలిగించాలన్నారు. రాష్ట్రంలో చాలా మంది బాలలు విధి వంచితులుగా ఉన్నారని, వారు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన చెందారు. వారి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మనకు ఉందని, బాలలకు మనమంత తోడుగా ఉన్నామన్న నమ్మకం కల్పించాలన్నారు. బాలల చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయగలిగితే రాష్ట్రంలో బాలలకు మంచి భవిష్యత్తు అందించగలమన్నారు. మనతో సమస్యలతో చెప్పుకోలేని,నోరు లేని చిన్న పిల్లల సంరక్షణను చేసే బాధ్యత మన మీద ఉన్నప్పుడు మానవత్వంతో వారిని దగ్గరికి తీసుకోవాలన్నారు. తానేప్పుడు పుట్టిన రోజు జరుపుకోలేదని, ఈ సారి మంత్రి అయిన సందర్భంగా తన శాఖలోని చిన్నపిల్లలతో పుట్టిన రోజు చేసుకోవాలని అనుకుని శిశువిహార్‌లో గడిపినప్పుడు సంతృప్తి ఇచ్చిందన్నారు. చిన్న పిల్లల సంక్షేమం, హక్కుల కోసం పనిచేస్తున్న యునిసెఫ్‌తో సమన్వయం చేసుకుని మనం బాలల సంరక్షణ హక్కుల పరిరక్షణ చేయాలన్నారు. ఇప్పటికీ చాలా మంది తమ ఆర్థిక పరిస్థితులు బాగులేక ఎదిగిన అమ్మాయిలను పెళ్లిపేరుతో ప్రలోభాలకు లొంగి పంపించి వేధిస్తున్నారన్నారు. ఇలాంటి దురాగతాలను అరికట్టాలన్నారు.
కనీస హక్కులు లేకుండా ఉంటున్న పిల్లలకు అన్ని స్థాయిల్లో మనం అండగా ఉంటామన్న ధీమా కల్పించాలని , బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మన కోసం ఉందని, అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కు పరిరక్షణ కమిషన్ చైర్మన్ జోగిన పల్లి శ్రీనివాసరావు, సభ్యులు అంజన్ కుమార్ , చిట్టిమల్ల రాగోజ్యోతి, శోభారాణి, అపర్ణ, ఎడ్లపల్లి బృందాదర్ రావు, ఏ దేవయ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్, బాల నేరస్తుల సంక్షేమం, సంస్కరణలు, వీధిబాలల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.