క్రైమ్/లీగల్

‘370’ రద్దుతో నిజమైన ఐక్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, నవంబర్ 1: రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తి హోదాను తొలగించడం ద్వారా భరత జాతికి ఉన్న నిజమైన ఐక్యతను చాటినట్లు అయ్యిందని ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. లోగడ 370-అధికరణ అమలులో ఉండడం వల్ల కాశ్మీర్‌కు, దేశ ప్రజలకు మధ్య అడ్డుగోడ ఉండేదన్నారు. కేంద్రానికి రాజ్యసభలో తగిన బలం లేకపోయినా 370-అధికరణ రద్దు విషయంలో సానుకూలత లభించిందని ఆయన చెప్పారు. లోక్‌సభలో మెజారిటీ ఉందన్నారు. భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగమని ఆయన తెలిపారు. అక్కడి పరిపాలన విధానాన్ని కేంద్రం మార్చాలన్న పట్టుదలతో ఉందన్నారు. అయితే కొంత మంది ఈ విషయంలో దుష్టశక్తులతో జతకట్టి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాశ్మీర్ అంశం పూర్తిగా భారత దేశం అంతరంగిక వ్యవహారం అని ఆయన తెలిపారు. దేశ అంతరంగిక విషయంలో జోక్యం చేసుకునే అర్హత ఇతరులకు లేదన్నారు. పొరుగు దేశం మన దేశ అంతరంగిక వ్యవహారంలో తలదూర్చే ప్రయత్నం చేస్తున్నదని ఆయన విమర్శించారు. భారత్‌లో శాంతి-్భద్రతలకు విఘాతం కలిగించాలన్న దురుద్ధేశ్యంతో యువతకు శిక్షణ ఇస్తున్నదని ఆయన తెలిపారు. ఈ కుయుక్తుల పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. రాజ్యాంగంలోని 370-అధికరణ రద్దుతో కాశ్మీర్‌ను ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలని, అక్కడి ప్రజల కల నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు.

దేశ విభజనకు పాల్పడే వారిని ఆటలు సాగనీయవద్దని, కుల, మతాలకు అతీతంగా భారత దేశ ప్రజలంతా ఒక్కటేనని చాటి చెప్పాలని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు తెలిపారు.