తెలంగాణ

‘చాగంటి’కి నేడు ధార్మిక వరేణ్య బిరుదు ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు ‘్ధర్మికవరేణ్య’ బిరుదు ఇస్తున్నామని దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకులు ఎంవీఆర్ శర్మ తెలిపారు. దర్శనమ్ మాసపత్రిక నేతృత్వంలో ఏటా ‘గురువందమ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ (నాంపల్లి) లోని తెలుగు లలిత కళాతోరణం ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని చాగంటిని సన్మానిస్తారని తెలిపారు. దర్శనమ్ 15 వ వార్షికోత్సవం సందర్భంగా గురుసత్కార మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 180 నెలవారీ సంచికలు, 26 విశిష్ట సంచికలు ప్రచురించామని శర్మ వివరించారు. సనాతన ధర్మపరిరక్షణ ధ్యేయంగా ధర్మనిష్టతో వివివిగా ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను, తెలుగు, సంస్కృత భాషావికాసం కోసం అవధానాలను నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఆదిశంకరులు స్థాపించిన చరురామ్నాయ పీఠాల జగద్గురువులను, ధర్మాచార్యులను, పీఠాధీశ్వరులను ఏటా గురువందనమ్ సందర్భంగా సన్మానిస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక, ధార్మిక రంగాల్లో అవిరళ కృషి చేస్తున్న ధార్మిక వేత్తలకు ఏటా ధార్మిక వరేణ్య పురస్కారం అందిస్తున్నామన్నారు.