తెలంగాణ

రైల్వే కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: ఈనెల 28-30 తేదీల్లో జరగాల్సిన రైల్వే కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈమేరకు రైల్వే బోర్డు కార్మిక సంఘాల యూనియన్ నేతలకు సమాచారం పంపింది. రైల్వేలో గుర్తింపు కార్మిక సంఘం కోసం రైల్వే బోర్డు ఎన్నికలు నిర్వహిస్తుంటుంది. ఎన్నికల ఏర్పాట్లపై ఇంకా రైల్వే బోర్డు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తమ లేఖలో పేర్కొంది. అయితే ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామో అన్న అంశం మాత్రం స్పష్టంగా చెప్పలేదు. సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న దక్షిణ మధ్య రైల్వేని విభజించి విశాఖపట్నం కేంద్రంగా తూర్పు దక్షిణ మధ్య రైల్వేగా ఏర్పాటు చేయడంతో ఉద్యోగ, కార్మికులు విభజన పూర్తిస్థాయిలో జరగలేదని, అందుచేత దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌లో రైల్వే కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించవద్దని దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘ్ జనరల్ సెక్రటరీ టీవీ సుబ్బరామయ్య రైల్వే బోర్డ్‌కు సూచించారు. ప్రధాన కార్మిక సంఘాలు మాత్రం కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని రైల్వే బోర్డ్‌కు లేఖలు రాశాయి. రైల్వే గుర్తింపు యూనియన్‌లలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఏఐఆర్‌ఎఫ్, ఎన్‌ఎఫ్‌ఐఆర్ రైల్వే బోర్డు నిర్ణయం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాయి.