తెలంగాణ

నైతిక ప్రవర్తనతోనే అవినీతి రహిత సమాజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: పౌరుల నైతిక ప్రవర్తన వల్లనే అవినీతి రహిత సమాజ నిర్మాణానికి భరోసా కలుగుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో రైల్వే విజిలెన్స్ వారోత్సవాలను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రజలను చైతన్యం చేయడానికి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే జీఎం మాట్లాడుతూ సమాజం నుంచి అవినీతిని నిర్మూలించడానికి నైతికతను నిర్మించడానికి మద్దతు పలుకుతూ భారీ సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేశామన్నారు. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్‌లో వివిధ కార్యక్రామలను చేపట్టినట్లు తెలిపారు. ఎదుగుతున్న యువతీయువకుల్లో సద్గుణాలను పెంచడానికి తల్లిదండ్రుల కృషి ఎంతో అవసరమని ఆయన ఉద్ఘాటించారు. భవిష్యత్‌లో యువకులే సమాజానికి మూలస్తంభాలని ఆయన అన్నారు. సైకిల్ ర్యాలీలో రైల్వే సీనియర్ అధికారులతో పాటు సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ సైకిల్ ర్యాలీని సికింద్రాబాద్, మెట్టుగూడ రైల్ కళ్యాణ్ నుండి దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రారంభించారు.
*చిత్రం...రైల్వే నిఘా వారోత్సవాల సందర్భంగా సైకిల్ ర్యాలీలో పాల్గొన్న రైల్వే జనరల్ మేనేజర్ గజానన్