తెలంగాణ

మిషన్ భగీరథ నీటి వినియోగంపై గ్రామాల్లో అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: మిషన్ భగీరథ నీటి వినియోగంపై గ్రామాల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు 100 రోజులపాటు నిర్వహించడానికి కార్యాచరణను రూపొందించినట్లు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) కృపాకర్‌రెడ్డి తెలిపారు.
మిషన్ భగీరథ నీళ్లు అత్యంత సురక్షితమైనవన్న విషయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి, అందరూ భగీరథ నీళ్లు తాగేలా చేయడమే ఈ అవగాహన కార్యక్రమాల లక్ష్యం. ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో శనివారం అన్ని జిల్లాల ఎస్‌ఈలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
చీఫ్ ఇంజనీర్ నుంచి ఏఈఈ స్థాయి అధికారులంతా గ్రామాల్లోని ఇంటింటికి తిరిగి భగీరథ నీటిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలిగించాలని ఈఎన్‌సీ సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు జగన్‌మోహన్ రెడ్డి, విజయ్‌పాల్‌రెడ్డి, విజయ్ ప్రకాశ్, వినోభాదేవి, చిన్నారెడ్డి, చక్రవర్తి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*చిత్రం...ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో శనివారం అన్ని జిల్లాల ఎస్‌ఈలతో నిర్వహించిన సమీక్ష