తెలంగాణ

బెదిరింపులతో సమస్యలను పరిష్కరించలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు బెదిరింపులతో సమస్యలను పరిష్కరించాలని చూస్తే సాధ్యం కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేటు పరం చేస్తామని చెబుతున్నారని, ప్రైవేటు పరం చేస్తే అవి ఆర్టీసీ కార్మికులు ప్రజల శవాలపై తిరగాలి లేదా ఆకాశంలో తిరగాలే తప్ప భూమి మీద తిరగడానికి లేదని స్పష్టం చేశారు. సమ్మె చట్టవిరుద్ధమని చెప్పాల్సింది సీఎం కాదని, అది కార్మిక శాఖ చెప్పాలని, కార్మికులు బెదిరిపోవల్సిన అవసరం లేదని, ఇది ప్రజలందరికీ సవాలేనని ఆర్టీసీని కాపాడుకోవల్సిందేనని వ్యాఖ్యానించారు.
ఆర్టీసీ కార్మికులు ప్రతిపాదించిన అన్ని డిమాండ్లపై చర్చలు జరగాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. కొన్ని సమస్యలు తక్షణం పరిష్కరించగలిగేవి ఉంటాయని, మరికొన్ని సమయం పట్టేవి ఉంటాయని, వాటిపై చర్చలు కొనసాగించాలని, కొన్ని పరిష్కరించలేనివి ఉంటే ఆ అంశాన్ని కార్మికులకు వివరించి, వాటిపై కార్యాచరణ రూపొందించుకోవాలని అంతే తప్ప ఆర్టీసీని మూసేస్తాం అనే మాట సరికాదని పేర్కొన్నారు. సీపీఐ జాతీయ పార్టీ హోదా ఉంటుందా లేదా అన్న అంశాలను పక్కన పెట్టి ప్రజాసమస్యలపై ఉద్యమించే రాజకీయ స్ఫూర్తిని ఎపుడూ కొనసాగిస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీతో, కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లో కలిసి పనిచేసినంత మాత్రాన సీపీఐ స్వీయ సిద్ధాంతాలను వదులుకోదని, ప్రజల పక్షాన నిరంతరం పోరు సాగించే పార్టీగా కొనసాగుతుందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి అధికారులు కోర్టుకు వాస్తవిక వివరాలు సమర్పించాలని, ఆర్టీసీలో ఏం జరుగుతుందనే నిజాలు చెప్పాలని అన్నారు.
అధికార పార్టీకి హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో మద్దతు పలికిన మాట వాస్తవమేనని, ప్రజలకు అనుకూల నిర్ణయాలు చేసినపుడు అధికార పార్టీకి మద్దతు పలకడం తప్పులేదని, ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకునేటపుడు తమ మద్దతు ఉపసంహరించుకున్నామనేది గుర్తించాలని అన్నారు. శాశ్వతంగా తాము టీఆర్‌ఎస్‌తో కలిసి ఉంటామని ఎపుడూ చెప్పలేదని పేర్కొన్నారు.