తెలంగాణ

శబరిమలకు 12 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప భక్తుల సౌకర్యం కోసం శబరిమలకు వెళ్లడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఈనెల 16 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు నడుపుతారు. దాదాపు 12 ప్రత్యేక రైళ్లను హైదరాబాద్, కాకినాడ, నిజామాబాద్ నుంచి శబరిమలకు రైళను నడుపుతారు. హైదరాబాద్-కొల్లాం-హైదరాబాద్ నుంచి 07109-07110 ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైలు సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు. రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్, ఈరోడ్, కోయంబత్తూర్. ఒట్టపాలెం, ఎర్నాకులం, కొట్టాయం, చెంగనూర్ మీదుగా కొల్లాం చేరుకుంటుంది. నిజామాబాద్-కొల్లాంకు 07613 రైల్‌ను నడపుతారు. నిజామాబాద్ నుంచి కామారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూల్, గుత్తి, తాడిపత్రి, కడప, రైణిగుంట, కాట్పాడి, ఈరోడ్డు, కోయంబత్తూర్, ఎర్నాకులం, కొట్టాయం, చెంగనూర్ మీదుగా కొల్లాం చేరుకుంటుంది. కాకినాడ-కొల్లాంకు 07211-07212 రైళ్లు నడుస్తాయి. ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు. రేణిగుంట, తిరుత్తని, సేలం, తిరుపూర్, పాలక్‌కాడ్, అలువ, కొట్టాయం, తిరువళ్ల మీదుగా కొల్లాం చేరుకుంటుంది, భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు సువిధ ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈ రైళ్లు 82843- 82844 ఆయా రైల్వే మార్గాల్లో నడుస్తాయని రైల్వే సీపీఆర్‌వో రాకేశ్ తెలిపారు.