బిజినెస్

జీఎస్‌టీ వసూళ్ల నుంచి రాష్ట్ర వాటా చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: జీఎస్‌టీ వసూళ్ల నుంచి రాష్ట్రాలకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు లేఖ రాశారు. జీఎస్‌టీ వసూళ్ల నుంచి రాష్ట్రాలకు మొత్తం రూ. 1,76,688 కోట్లలో రూ. 67,998 కోట్లు మాత్రమే చెల్లించినట్టు తన లేఖలో హరీశ్‌రావు గుర్తు చేశారు. వాస్తవానికి కాగ్ నివేదిక ప్రకారం జీఎస్‌టీలో 50 శాతాన్ని రాష్ట్రాలకు విడుదల చేయాల్సి ఉందన్నారు. ఈ లెక్కన
రూ.88,344 కోట్లు పంచాల్సి ఉందన్నారు. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రూ.3,560 కోట్లు రావాల్సి ఉండగా రూ.1,652 కోట్లు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. మిగతా రూ.2,812 కోట్లు వెంటనే విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. జీఏస్‌టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు నిధులు పంచకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హరీశ్‌రావు పేర్కొన్నారు.
*చిత్రం... రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు