తెలంగాణ

వెలిదండలో విషాదఛాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరిడేపల్లి : హత్యకు గురైన తహశీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో సూర్యాపేట జిల్లా వెలిదండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయారెడ్డి హత్య సంఘటనలో తహశీల్దార్ ప్రాణాలను కాపాడబోయి తన ప్రాణాలను బలి ఇచ్చి అమరుడైన కామళ్ల గురునాథం మృతిపట్ల ప్రతి ఒక్కరూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. గురునాథం మృతి విషయం తెలియడంతో వెలిదండ గ్రామమంతా ఒక్కదగ్గరికి చేరి సానుభూతి వ్యక్తం చేశారు. గురునాథం ఇంటివద్దకు పెద్ద ఎత్తున చేరిన గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. గ్రామానికి చెందిన యువకులు మొత్తం స్థానిక పాఠశాల వద్దకు చేరి నల్లబ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులతో కలిసి సంతాపం వెలిబుచ్చారు. కాగా, మంగళవారం రాత్రి 7గంటలకు స్వగ్రామమైన వెలిదండకు గురునాథం మృతదేహం చేరింది. గురునాధంను కడసారిగా చూసేందుకు గ్రామస్తులు పెద్దయెత్తున వచ్చారు. ఈ సందర్భంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అబ్దుల్లాపుర్ మెట్‌లో జరిగిన ఘటనలో మృత్యువాత పడిన కామళ్ల గురునాథం గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందినవారు. వెలిదండలోని కామళ్ల బ్రహ్మయ్య, రమణమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో పెద్దవాడు గురునాథం. రెండవ కుమారుడు శ్రీకాంత్ కూలి పనిచేస్తుండగా, చిన్నకుమారుడు కిరణ్ చదువుకుంటున్నాడు. తండ్రి పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. గురునాథం ఆరుసంవత్సరాలు క్రితం హైదరాబాద్‌కు వెళ్లి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురునాథానికి నేరేడుచర్ల మండలం వైకుంఠాపురం గ్రామానికి చెందిన సౌందర్యతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉండగా, ప్రస్తుతం భార్య సౌందర్య 8 నెలల గర్భిణి. దీంతో గురునాథం కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. గురునాథానికి కుమారుడు సిద్దార్ధ(4), ఉండటం ప్రస్తుతం భార్య గర్భవతిగా ఉండటం పట్ల గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.