తెలంగాణ

విజయా రెడ్డికి కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, నవంబర్ 5: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల తహశీల్దార్ విజయా రెడ్డి అంత్యక్రియలు మంగళవారం నాగోల్‌లోని శ్మశానవాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ దహన సంస్కారాలు నిర్వహించారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. విజయా రెడ్డి చితికి భర్త సుభాష్ రెడ్డి నిప్పంటించారు. సోమవారం ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం రాత్రి సరూర్‌నగర్ మండలం ఆర్కేపురం డివిజన్‌లోని వాసవి కాలనీలో తన నివాసానికి తహశీల్దార్ విజయా రెడ్డి భౌతికఖాయాన్ని తీసుకువచ్చిన కుటుంబ సభ్యు లు మంగళవారం దహన సంస్కారాలు నిర్వహించారు. ఉదయం నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, పలువురు ఆర్‌డీ ఓలు, తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది వేలాదిగా తరలివచ్చారు. వాసవి కాలనీ నుంచి విజయా రెడ్డి భౌతిక కాయాన్ని మధ్యాహ్నం 12:30 గంటలకు అంతిమయాత్ర నిర్వహించగా.. దారిపొ డవున పెద్ద ఎత్తున రెవెన్యూ ఉద్యోగులు అంతిమయాత్రంలో పాల్గొన్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతిమయాత్ర అల్కాపూరి చౌరస్తాకు రాగానే రెవెన్యూ ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తహశీల్దార్ భౌతికకాయాన్ని చూడటానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన రెవెన్యూ ఉద్యోగులు, వివిధ పార్టీల నేతలతో ఈ ప్రాంతం పూర్తిగా జన సంద్రంగా మారింది. తహశీల్దార్ విజయా రెడ్డి భౌతిక కాయాన్ని శ్మశాన వాటిక వరకు భుజాలపై మోశా రు. దారిపొడవునా రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. వీ వాంట్ జస్టిస్ అనే నినాదాలు దారి పొడువునా చేశారు.
తహశీల్దార్ విజయారెడ్డిని దారుణంగా హత్య చేయటం దారుణమని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల ప్రోద్భలంతోనే విజయారెడ్డి హత్య జరిగినట్లు ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజయా రెడ్డి హత్య ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ హత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. అదే విధంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక అధికారిపై అతిదారుణంగా దాడిచేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మహిళాధికారి అనికూడా చూడకుండా హత్య చేయటం అతి హేమమైన చర్యగా ఆయన వర్ణించారు. తహశీల్దార్ విజయా రెడ్డిపై దాడిచేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
విజయా రెడ్డికి పలువురి నివాళి
సురేష్ అనే దుండగుడి చేతిలో అతిదారుణంగా హత్యకు గురైన తహశీల్దార్ విజయా రెడ్డి భౌతిక కాయాన్ని పలువురు సందర్శించి నివాళులు అర్పించారు. ప్రొ. కోదండరామ్, ఎంపీ రేవంత్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఆర్‌టీసీ జేఏసీ చైర్మన్ అశ్వాత్థామ రెడ్డి, పంచాయతీ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, ఐఏఎస్ అధికారి అమ్రపాలి, కలెక్టర్ హరీష్, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగా రెడ్డి, పలువురు డిప్యూటీ కలెక్టర్లు, ఆర్‌డీఓలు, తహశీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
*చిత్రం...మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నివాళి