బిజినెస్

రియాల్టీకి మరింత ఊతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: రియాల్టీ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచనప్రాయంగా వెల్లడించారు. మంగళవారం ఇక్కడ జరిగిన జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ) రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఇటీవల ప్రకటించిన కొన్ని రాయితీలతో రియాల్టీ రంగం ఆశించిన స్థాయిలో పుంజుకోలేదని అన్నారు. అందుకే ఈ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో కలసి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుందని ప్రకటించారు. అయితే, వివరాలను ఆమె వెల్లడించలేదు. ఈ ఏడాది జూలైలో బడ్జెట్‌లో కార్పొరేట్ రంగంపై విధించిన పన్నులను కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతేకాక 22 శాతం పన్ను రాయితీని ప్రకటించి కార్పొరేట్ రంగానికి ఊతాన్నిచ్చింది. దీనిద్వారా 1.3 లక్షల కోట్ల రూపాయల మేరకు కార్పొరేట్ రంగానికి ప్రయోజనం కలిగింది. కాగా, ఆగస్టులో రియాల్టీ రంగానికి కేంద్రం అండగా నిలచింది. పలు రాయితీలను ప్రకటించింది. అయితే, ఆశించిన స్థాయిలో అభివృద్ధి రేటు కనిపించకపోవడంతో మరోసారి ఉద్దీపన పథకాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్టు సీతారామన్ చెప్పారు. అన్ని రంగాలకు కేంద్రం చేయూత ఇస్తోందని, అయితే ఇంతవరకు స్టాక్ మార్కెట్‌లపై తాము దృష్టి కేంద్రీకరించలేదని ఆమె వ్యాఖ్యానించారు. స్టాక్ మార్కెట్ అభివృద్ధికి కూడా సరికొత్త విధానాలను రూపొందించే ప్రయత్నాలు జరుగుతాయని ఆమె వెల్లడించారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితి భారత స్టాక్ మార్కెట్లు సానుకూల ఫలితాలను రాబట్టడం విశేషమని ఆమె అన్నారు.
*చిత్రం...జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ) సిల్లర్ జూబ్లీ సందర్భంగా ముంబయిలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిబీ చైర్మన్ అజయ్ త్యాగి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్