తెలంగాణ

మిడ్ మానేరు నిర్వాసితులకు న్యాయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్‌ను కోరారు. మంగళవారం ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేతలు టీ జీవన్ రెడ్డి, డీ శ్రీ్ధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎం సత్యం, ఏ శ్రీనివాస్, ఎన్ సత్యనారాయణ్ గౌడ్ తదితరులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు వినతిపత్రం అందచేశారు. 2015 జూన్ 18వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడలో మాట్లాడుతూ మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదన్నారు. నిరుద్యోగ యువతకు ఆర్థికసహాయం అందించాలన్నారు. దీని వల్ల వారు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా పరిగణించి ప్రత్యామ్నాయంగా భూములను పంపిణీ చేయాలన్నారు. మహిళలకు స్వయం ఉపాధి వృత్తులపై శిక్షణ ఇవ్వాలన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ముంపునకు గురయ్యే భూములపై తాజా అంచనాలతో నివేదికను రూపొందించాలని కోరారు.