తెలంగాణ

విత్తనోత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణలో విత్తనోత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నెదర్లాండ్స్ రాజధాని హేగ్ నగరంలోని క్రౌన్‌ప్లాజాలో డచ్ ట్రేడ్‌మిషన్ పెట్టుబడిదారులు సమావేశంలో మంగళవారం ఆయన ప్రసంగించారు. భారత దౌత్య కార్యాలయం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నెదర్లాండ్స్‌లో భారత అంబాసిడర్ వేణు రాజమోని, ఎంబసీ సెక్రటరీ మృణాళిని సాప్రా, నెదర్లాండ్స్ ప్రభుత్వ సంబంధాల ఉపాధ్యక్షుడు జేమ్స్‌హాల్,నెదర్లాండ్స్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు, నెదర్లాండ్స్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు, డచ్ కంపెనీల ప్రతినిధులు, డచ్ ట్రేడ్ మిషన్ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించాలంటూ డచ్ ట్రేడ్ మిషన్ సభ్యులను ఆయన ఆహ్వానించారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి తెలంగాణ ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. ఆహార పంటల ఉత్పత్తిలో తెలంగాణ అతిపెద్ద రాష్ట్రంగా పేరుతెచ్చుకున్నదన్నారు. ఈ పరిస్థితిలో ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి తెలిపారు. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్ డ్యామ్ సమీపంలో ఆస్లామీర్ ప్రాంతంలో 128 ఎకరాల్లో ఉన్న ప్రపంచంలోని మూడో అతిపెద్ద పూల వేలం భవనాన్ని నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సందర్శించింది. ఈ సందర్భంగా విత్తన ఎగుమతులపై నెదర్లాండ్స్, తెలంగాణ మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. అధిక దిగుబడి ఇచ్చే వేరుసెనగ సాగుకు సహకార ఇస్తామని డచ్ ట్రేడ్ మిషన్ ఈ సందర్భంగా తెలంగాణ బృందానికి హామీ ఇచ్చింది.