తెలంగాణ

మరో రెండు రోజులు రెవెన్యూ విధుల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా మరో రెండు రోజుల పాటు రెవెన్యూ ఉద్యోగులంతా విధులు బహిష్కరిస్తున్నట్టు రెవెన్యూ జేఏసీ ప్రకటించింది. తెలంగాణ రెవెన్యూ జేఏసీ నేతలు వి. లచ్చిరెడ్డి, ఎస్. రాములు, గరికే ఉపేంద్రరావు, ఎన్. లక్ష్మీనారాయణ, ఏ. బాలనర్సయ్య, సంతోష్, వంగూరు రాములు, బి. సుధాకర్ తదితరులు ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు రెవెన్యూ కార్యాలయాలను బంద్ చేశామన్నారు. తహశీల్దార్ కార్యాలయాలు మొదలుకుని సీసీఎల్‌ఏ కార్యాలయం వరకు అన్ని స్థాయిల కార్యాలయాల ఎదుటు మంగళవారం ధర్మా నిర్వహించామని వివరించారు. జిల్లా కలెక్టరేట్ల ముందు బుధ, గురువారాల్లో రిలే నిరాహారదీక్షలు చేపట్టాలని జేఏసీ పిలుపు ఇచ్చింది. విజయారెడ్డి హత్య రెవెన్యూ ఉద్యోగులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని, విజయారెడ్డిని హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
రెవెన్యూ ఉద్యోగ సంఘాల తరఫున ఒకరోజు వేతనాన్ని విజయారెడ్డి డ్రైవర్ గుర్నాథం కుటుంబానికి అందిస్తామని లచ్చిరెడ్డి హామీ ఇచ్చారు. విజయారెడ్డి హత్య సందర్భంగా రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. ఈ డిమాండ్లు ఇలా ఉన్నాయి.
* విజయారెడ్డిని హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. సజీవ దహనానికి దారి తీసిన అంశాలపై సీబీఐతో విచారణ జరపాలి. కుట్రదారులను గుర్తించి శిక్షించాలి.
* విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడి మంగళవారం మరణించిన డ్రైవర్ గుర్నాథం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలి.
* విజయారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి.
* రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులందరికీ భరోసా కల్పించాలి.
* క్యాడర్లవారీగా ఉన్న రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి.
* పని భారాన్ని తగ్గిస్తూ, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
* రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించాలి.
* రెవెన్యూ శాఖలో ఉన్న సాంకేతిక తదితర సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలి.
మానసిక స్థైర్యం కల్పించాలి: చంద్రమోహన్
రెవెన్యూ ఉద్యోగుల్లో మానసిక స్థైర్యం కల్పించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, విజయారెడ్డి హత్యను ఖండిస్తున్నామని, ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే రెవెన్యూ ఉద్యోగులందరికీ భద్రత విషయంలో భరోసా కల్పించాలని కోరారు. రెవెన్యూ అధికారులు ప్రజల పనులను ఏదైనా కారణంగా చేయకపోతే ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని, ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని, సిబ్బందిపై దాడి చేయడం సరికాదని చంద్రమోహన్ సూచించారు.
నేడు సమావేశం: ట్రెసా
విజయారెడ్డి హత్యకు నిరసన వ్యక్తం చేస్తూ గ్రామస్థాయి నుండి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ఉద్యోగులంతా రెవెన్యూ బంద్‌లో పాల్గొంటున్నారని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ సంఘం (ట్రెసా) అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నామని మంగళవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు.