తెలంగాణ

విజయారెడ్డి సంఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: రెవెన్యూ అధికారి విజయారెడ్డి సజీవ దహనం కేసు విచారణను సీబీఐకు అప్పగించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మెజిస్ట్రేట్ అదికారాలు ఉన్న అధికారిపై దాడి దారుణమన్నారు. రాష్ట్రంలోశాంత భద్రతలు క్షీణించాయన్నారు. ఐదు వందల ఎకరాల భూ వివాదంలో ఈ సంఘటన జరిగిందన్నారు. విజయారెడ్డిపై ప్రజాప్రతినిధుల వత్తిడి ఉందన్నారు. ఘోరమైన సంఘటన జరిగినా, న్యాయం చేస్తాం అని ప్రభుత్వం నుంచి ఎలాటి హామీ రాలేదన్నారు. రెవెన్యూ శాఖ సీఎం దగ్గరే ఉందన్నారు. ఘటన జరిగి 24 గంటలు అయినా సీఎం నివాళులు అర్పించేందుకు రాలేదన్నారు. రెవెన్యూ అధికారులను ప్రభుత్వం దొంగలుగా చిత్రీకరణ చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. భూ వివాదంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వానికి రెవెన్యూ శాఖకు దూరం ప్రభుత్వమే పెంచిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటన తనను చాలా బాధ కలిగించిందన్నారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ సమస్యలను ఒకేసారి పరిష్కరించలేదన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేయడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండించింది. ఈ కేసును హైకోర్టు సిటింగ్ జడ్జి లేదా ఉన్నతస్థాయి కమిటీ చేత విచారణ జరిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కిలి ఐలయ్య యాదవ్ కోరారు. రెవెన్యూ ఉద్యోగులకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెచ్చగొట్టడం వల్లే విజయారెడ్డి సజీవ దహనానికి కారణమైందని ఆరోపణలు వస్తున్నాయన్నారు.