తెలంగాణ

9న మిలియన్ మార్చ్:ఆర్టీసీ జేఏసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈ నెల 9న ఆర్టీసీ కార్మికులు మిలియన్ మార్చ్ నిర్వహిస్తారని జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆయన బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ నిబంధనల మేరకు ఆర్టీసీ విభజన జరగలేదని అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు ఆర్టీసీ కార్మికులు స్పందించలేదని. కొంతమంది సిబ్బంది మాత్రమే విధుల్లో చేరారని తెలిపారు. ప్రభుత్వానికి కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డాను కలిసేందుకు తమ ప్రతినిధులు ఢిల్లీ వెళ్లారని తెలిపారు. మిలియన్‌ మార్చ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సంపూర్ణ మద్దతిచ్చారని అన్నారు. అలాగే మిలియన్‌ మార్చ్‌కు ఉద్యోగ సంఘాల మద్దతు కోరతామని అన్నారు. ప్రభుత్వంతో చర్చలకు ఆర్టీసీ జేఏసీ సిద్ధంగా ఉందన్నారు. చట్టబద్ధత ఉంటే...అటెండర్‌ కమిటీతోనైనా చర్చిస్తామన్నారు. సమ్మెను జఠిలం చేయొద్దని సీఎంను కోరుతున్నామని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు.