తెలంగాణ

సమ్మె మరింత ఉధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, ఇందులో భాగంగా ఈ నెల 9న మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. మిలియన్ మార్చ్‌కు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో పాటు ఉద్యోగ సంఘాల మద్ద తు కోరుతామని తెలిపారు. విధుల్లో చేరడానికి సీఎం కేసీఆర్ విధించిన గడువుకు, బెదిరింపులకు ఆర్టీసీ కార్మికులు లొంగలేదని స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అష్టకష్టాలు పడినా కనీసం 300 మంది కార్మికులు కూడా డ్యూటీకి రిపోర్టు చేయలేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువు ముగిసిన సందర్భంగా బుధవారం నాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, 33 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడలేదని
అశ్వత్థామరెడ్డి అన్నారు. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆత్మాభిమానం కోల్పోవద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్నిసార్లు గడువు విధించినా, బెదిరించినా, కార్మికులు మాత్రం మొక్కవోని పట్టుదలతో పోరుబాట వీడటం లేదని ప్రశంసించారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసే అధికారం ముఖ్యమంత్రికి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రైవేట్‌పరం చేయడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి తమ ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లారన్నారు. ఆర్టీసీ సమ్మె పట్ల సీఎం కేసీఆర్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదని, తమకు న్యాయం చేయడానికి న్యాయస్థానాలు ఉన్నాయని తెలిపారు. తాము చేపట్టబోయే మిలియన్ మార్చ్‌కు బీజేపీ మద్దతు ప్రకటించిందని అన్నారు. ఇతర పార్టీలను కూడా కలిసి మద్దతు కోరుతామన్నారు. ఉద్యోగులు కూడా మిలియన్ మార్చ్‌కు మద్దతు ఇస్తారని భావిస్తున్నామని తెలిపారు. వారిని కూడా కలిసి మద్దతు కోరుతామన్నారు. ప్రభుత్వం పిలిస్తే చర్చలు జరపడానికి తమకు బేషజాలు లేవని తేల్చిచెప్పారు. అయితే పిలిచేది అటెండరైనా, చట్టబద్ధత ఉంటేనే తాము వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికీ కూడా సమ్మెను జఠిలం చేయొద్దని సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. చర్చలకు పిలువకుండా డ్యూటీలో చేరడానికి సిద్ధంగా లేమని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. మంత్రులు స్వయంగా వెళ్లి తమ కార్మికులు కొందరిని డ్యూటీలో చేర్పించినా, వారు మళ్లీ తిరిగి వెనక్కి వచ్చేశారని పేర్కొన్నారు. డ్యూటీలో చేరడానికి వెళ్లిన కార్మికులకు కూడా డ్యూటీలు వేసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఆర్టీసీకి చెందిన కోట్లాది విలువైన ఆస్తులను బడా కంపెనీలకు అమ్ముకోవడానికే ప్రైవేట్‌పరం చేస్తామంటున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తుల లీజు పేరిట అమ్ముకోవడానికి కుట్ర జరుగుతున్నదని ధ్వజమెత్తారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వమని, ఆర్టీసీని కాపాడుకుంటామని ఆయన అన్నారు.
*చిత్రం... మీడియాతో మాట్లాడుతున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి