తెలంగాణ

విజయా రెడ్డి హత్యపై జ్యుడీషియల్ విచారణకు డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ హత్య సంఘటనపై వెంటనే జ్యుడీషియల్ విచారణ జరిపించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా), రెవెన్యూ జేఏసి డిమాండ్ చేశాయి. ట్రెసా, రెవెన్యూ జేఏసీ నాయకులు బుధవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంచార్జి సీసీఎల్‌ఏ అయిన సోమేశ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ట్రెసా, రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు విధులను బహిష్కరించి ఎక్కడికక్కడ ధర్నాలు చేశారు. మరో రెండు రోజుల పాటు విధులను బహిష్కరించాలని రెవెన్యూ జేఏసీ పిలుపు ఇచ్చింది. బుధవారం ఇక్కడ సమావేశమైన ట్రెసా, రెవెన్యూ జేఏసీ నేతలు విజయారెడ్డి హత్యపై చర్చించారు. అలాగే రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఆ తర్వాత వినతిపత్రం సిద్ధం చేసి సోమేశ్‌కుమార్‌కు అందించారు. విజయారెడ్డి హత్యపై జ్యుడీషియల్ విచారణ చేయాలని, మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సాయం అందించాలని కోరారు. విజయారెడ్డి భర్తకు రెవెన్యూ శాఖలో పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. విజయారెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తూ చనిపోయిన గురునాథం భార్యకు ఉద్యోగం ఇవ్వాలని, ఆర్థిక సాయం అందించాలని కోరారు.