తెలంగాణ

పని చేయని ప్రభుత్వాలపై తిరుగుబాటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారత ప్రజాస్వామ్యంలో ప్రజలే అధిపతులని, ప్రజల సమ్మతితో పనిచేయకుంటే ప్రభుత్వాలపై తిరుగుబాటు తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో భాగంగా బస్సులను డిపోల వద్ద అడ్డుకోవాలని అఖిలపక్షం, ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నాడు కాచీగూడ బస్సు డిపో వద్ద అఖిలపక్షం, ఆర్టీసీ జాక్ నేతలు, సీపీఐ నేతలు కలిసి బస్సులను అడ్డుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా విద్యార్ధినీ విద్యార్ధులు, ఉద్యోగులు బస్సులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రగతి భవన్‌లో తన గదికే పరిమితమై ప్రజాసమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. తన నియంతృత్వ పోకడలతో తనకు తాను తెలంగాణ రాష్ట్రానికి చక్రవర్తిగా ప్రకటించుకున్నా ఆశ్చర్యపడనక్కర్లేదని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికులవి న్యాయమైన డిమాండ్లని, ఉన్నత న్యాయస్థానం కూడా చర్చలు ద్వారానే పరిష్కరించాలని సూచించినా, సీఎం లెక్కచేయకపోవడం దారుణమని అన్నారు. ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలు పట్ల గౌరవాభిమానాలతో మెలగాలని, నియంతలా వ్యవహరించడం తగదని అన్నారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటీ నరసింహ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తన అహంకార ధోరణిని పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తగాదాలు లేకుండా శాంతియుతంగా న్యాయమైన ఆర్టీసీ కార్మికుల కోరికలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న నేతలు కే నారాయణ, చాడ వెంకటరెడ్డి ఇతర సీపీఐ నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్ బాలమల్లేష్, సీపీఐఎంఎల్ సహాయ కార్యదర్శి పీ రంగారావులు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.
సీపీఐ ఎంఎల్ నేతలు కే రమ, ఎస్‌ఎల్ పద్మ, అరుణ, జీ ఝాన్సీ తదితరుల అరెస్టులను ఖండిస్తున్నామని రంగారావు అన్నారు.
*చిత్రం... కాచిగూడ బస్ డిపో వద్ద ఆందోళన చేస్తున్న నారాయణ, చాడ వెంకట రెడ్డి, సీపీఐ శ్రేణులు