తెలంగాణ

ముందుంది మేడారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: మేడారం జాతర నేపధ్యంలో రవాణ సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజనశాఖ మంత్రి మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లను అభివృద్ధి చేయాలని, అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేయాలని మంత్రులు ఉన్నతాధికారులను ఆదేశించారు. డిసెంబర్‌లోపు అన్ని రకాల రోడ్డు పనులను పూర్తి చేసి ప్రయాణికులు సాఫిగా ప్రయాణం సాగేలా చూడాలన్నారు. జాతీయ రహదారుల విభాగం వరంగల్ డివిజన్ పరిధిలోని పనులపై మంత్రుల ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ గురువారం హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్ శాఖమంత్రి కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ ఎంపి మాలోతు కవిత, ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రోడ్లు భవనాలశాఖ ఇంజనీరింగ్ చీఫ్ గణపతిరెడ్డి, ఈస్ ఈ వసంత, ఈ ఈ వెంకటేశ్వరరావు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వరుస వర్షాల నేపథ్యంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మత్తులు చేయాలని అధికారులను వారు ఆదేశించారు. హైదరాబాద్ నుండి వరంగల్ మీదుగా ఎక్కువ మంది భక్తుల మేడారం జాతరకు వస్తారు. జాతీయ రహదారి నిర్మాణం పూర్తి కాకపోవడంతో కొంత మంది ఇబ్బందికర పరిస్థితి ఉందని అన్నారు. ఆలేరు, వంగపల్లి, వరంగల్ నగరం బైపాస్ రహదారుల పనులను వేగంగా పూర్తి చేయాలని అన్నారు. అదే విధంగా ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్, కరీంనగర్ మార్గాల నుండి మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా రోడ్లకు అవసరమైన మరమ్మత్తులు చేయాలని మంత్రులు తెలిపారు. వరంగల్-ఖమ్మం రహదారి బాగా దెబ్బతిన్నదని, శాశ్వత మరమ్మత్తులతో పాటు తక్షణం తాత్కలికంగా మరమ్మత్తులను పూర్తి చేయాలని అన్నారు. వరంగల్ ఎన్ హెచ్ డివిజన్‌కు సంబంధించి ప్రతిపాదన దశలో ఉన్న 5రహదారులకు జాతీయ రహదారి హోదా వచ్చేలా డిల్లీ స్ధాయిలో ఎంపీలు సంప్రదింపులు జరపాలని అన్నారు. వరంగల్ నగరంలో కాజీపేట- పెద్దమ్మగడ్డ, పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి కేయు క్రాస్ రోడ్డ పనులను ఈ నెలలోపూర్తి చేయాలని అన్నారు. రాంపూర్ నుండి కాజీపేట వరకు దెబ్బతిన్న హైదరాబాద్-వరంగల్ రహదారి మరమ్మత్తులకు ప్రతిపాదనలు సిద్దం చేసి పనులను ప్రారంభించాలని అన్నారు. వర్షాలు తగ్గుముఖంగా పట్టన నేపధ్యంలో రోడ్ల మరమ్మత్తు పనులను వెంటనే ప్రారంభించాలని అన్నారు. కాజీపేట రైల్వే బ్రిడ్జి నిర్మాణం పనులను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో దెవరుప్పుల, మొండ్రాయి, గిర్న తండా జంక్షన్ అభివృద్ధి పనులను చేయాలని అనా ను. జనగామ పట్టణం ప్రధాన రహదరి మరమ్మత్తుల ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. మేడారం జాతరకు అనుసంధానం అయ్యే అన్ని రకాల మరమ్మత్తులను విస్తరణ పనులను నవంబర్‌లోగా పూర్తిచేయాలని, డిసెంబర్ చివరలో అన్ని పనులపై మరొక సారి ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు.
*చిత్రం...అధికారులు, శాసనసభ్యులతో మేడారం జాతర ఏర్పాట్లపై బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు