తెలంగాణ

కుల వృత్తులకు ప్రభుత్వ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: గత ప్రభుత్వాలు కనీసం కులవృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, కుల వృత్తులకు అండగా ప్రభుత్వం నిలిచిందని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జీవో నెంబర్ 314 ద్వారా ప్రభుత్వం రూ. 10.09 కోట్లు మంజూరు చేసింది. వృత్తిలో చనిపోయిన ప్రాణాలను తీసుకురాలేమని, ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం వస్తే రూ.5లక్షల ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. కల్లు గీత కార్మికులకు వృత్తిలో భాగంగా చనిపోతే గతంలో రెండు లక్షలు మాత్రమే ఇచ్చేవారు, కానీ ఇపుడు దాన్ని 5లక్షలకు, అదే విధంగా శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గతంలో కల్లుగీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా వస్తుందో రాదో తెలియదు, ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో కేసీఆర్ ఆదేశాల మేరకు 3497 మంది గీత కార్మికులకు 15 కోట్ల బకాయిలు ఇదే రవీంద్రభారతిలో ఇవ్వడం జరిగిందని మంత్రి గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కల్లు గీత పనివారుల సంఘం ప్రతినిధులు, గౌడ హాస్టల్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లే లక్ష్మణ్ రావుగౌడ్, జాతీయ అధ్యక్షుడు వట్టికూటి రామారావు గౌడ్, గౌడ కల్లు గీత ఐక్య సాధన సమితి అధ్యక్షుడు యెలికట్టె విజయ్ కుమార్‌గౌడ్, కల్లు గీత కార్మిక పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు రమణగౌడ్, కేవీఎల్ గౌడ్, సాయిలు గౌడ్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.