తెలంగాణ

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నేడు భారీ ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ సహా వివిధ సంఘాలు నిర్వహించిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఎఐకేఎస్, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు, టీజీఎస్, ఎఐఎస్‌ఎఫ్, టీపీఎన్‌ఎం, బీసీ సబ్ ప్లాన్ సంఘాల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరాపార్కు వరకూ నిర్వహంచగా, ర్యాలీనీ పోలీసులు అడ్డుకుని నాయకులను అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో ఎఐకేఎస్ రైతు సంఘం ప్రధానకార్యదర్శి పశ్యపద్మ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ జ్యోతి, టీజీఎస్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్ నాయక్ తదితరులున్నారు. 34 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ర్యాలీ నిర్వహించాలంటే అనుమతి ఇవ్వకపోగా, ఎక్కడివారిని అక్కడే అరెస్టు చేయడం దారుణమని ఎఐటీయూసీ ప్రధానకార్యదరిశ వీఎస్ బోస్ అన్నారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలనుకుంటే పోలీసులు కావాలనే అడ్డుకుని అరెస్టులు చేశారని ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని, ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు తిరుగుబాటు చేస్తాయని హెచ్చరించారు. కాగా 9న జరిగే ఛలో ట్యాంకుబండ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఓయూ జాక్ నేతలు కాంపల్లి శ్రీనివాస్(ఎఐఎస్‌ఎఫ్) , గడ్డం శ్యామ్ (పీడీఎస్‌యూ), కృష్ణ మాదిగ(టీఎస్‌యు), గణేష్(ఎస్‌ఎఫ్‌ఐ), దుబ్బ రంజిత్ (పీడీఎస్‌యూ) పిలుపునిచ్చారు.