తెలంగాణ

ఆర్టీసీ పరిరక్షణ బాధ్యత మనందరిదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, నవంబర్ 9: రాష్ట్రంలో ఆర్టీసిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శాసనమండలి చైర్మన్‌గా నియమించబడ్డ తరువాత మొదటి సారిగా నాగార్జునసాగర్‌కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానం చేశారు. సర్పంచ్‌లు, పీఆర్‌టీయూ నాయకులు స్ధానిక విజయవిహార్ చేరుకున్న గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు చెంద్యానాయక్, పీఆర్‌టీయూ మండల అధ్యక్షులు వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శులు లక్ష్మిప్రభా, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, రాయపరెడ్డి, సత్యనారాయణ, కోటిరెడ్డిలు ఘనంగా సన్మానించారు. అనంతంరం నాగార్జునసాగర్ హిల్ కాలనీలో నిర్మాణమవుతున్న రెడ్డి సంక్షేమ భవనాన్ని సందర్శించి పరిశీలించారు. ఆపై సాగర్‌లో తన నివాసంలో విలేకర్లతో మాట్లాడుతూ అయోధ్య విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అందరు గౌరవించాలన్నారు. ఆర్టీసి గురించి మాట్లాడుతూ ప్రభుత్వం తప్పనిసరిగా కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తుందన్నారు. కార్మిక నాయకుల సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. వ్యక్తిగత దుషణలతో మాట్లాడకుండా కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, కార్మికుల మధ్య సయోధ్య కుదిరేలా వ్యవహరించాలన్నారు. వీరితో పాటు జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి , యడవెళ్లి విజయేందర్‌రెడ్డి, బ్రహ్మారెడ్డి, విష్ణుమూర్తి, చంద్రయ్య, కాటు కృష్ణా, చంద్రవౌలి, మధులు పాల్గొన్నారు.
*చిత్రం... శాసనమండలి చైర్మన్ హోదాలో మొదటిసారిగా సాగర్ వచ్చిన గుత్తాను సన్మానిస్తున్న నేతలు