తెలంగాణ

మహామేరు నిర్మాణం అనితర సాధ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 9: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేక పురోగతి సాధించినా చారిత్రక కట్టడాల ముందు దిగదుడుపుగా ఉన్న నేటి కాలంలో అనితర సాధ్యమైన శ్రీ కైలాస ప్రస్తార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం చేపట్టడం అనితర సాధ్యమైనదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శ్లాఘించారు. సంగారెడ్డి సమీపంలోని పసల్‌వాది గ్రామ శివారులో నిర్మింపజేస్తున్న విశిష్టమైన ఆలయం ఆవరణలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న సప్త సరస్వతీ సమర్చన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు స్తోత్ర సమర్చనకు ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించిన మంత్రి భక్తిపారవశ్యంతో తన్మయం చెందారు. ఈ సందర్భంగా మంత్రిని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు సిద్ధాంత బాస్కర బిరుదాంకితులైన మహేశ్వర శర్మ సిద్ధాంతి మంత్రిని పూర్ణకుంభంతో స్వాగతించారు. ముందుగా ఆలయ నిర్మాణ తీరుతెన్నులను దగ్గరగా పరిశీలించి వివరాలను సిద్ధాంతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేదికపైకి చేరుకుని సరస్వతీమాతకు పూజలు నిర్వహించిన మంత్రి ఆశేషంగా తరలివచ్చిన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. మంత్రి హరీష్‌రావు ప్రసంగం ఆధ్యాత్మిక గురువులు చెప్పే ప్రవచనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండటంతో భక్తులు ఆసక్తిగా శ్రవణం గావించారు.
ఢిల్లీలో అయోధ్య రాముడి తీర్పు వెలువడిన శుభ సందర్భం రోజున పసల్‌వాదిలో నిర్వహిస్తున్న సప్త సరస్వతీ సమర్చన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించడం భగవత్ సంకల్పమంటూ పేర్కొన్నారు. సిమెంటు, స్టీలు వస్తువులతో భౌళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్న నేటి కాలంలో చారిత్రిక కట్టడాల మాదిరిగా ప్రాచీన పద్దతులను అనుసరిస్తూ మహామేరు ఆలయ నిర్మాణం చేపట్టే ఆలోచనను మహేశ్వర శర్మ సిద్ధాంతికి భగవంతుడు ఇచ్చిన అనుగ్రహమని, ఇలాంటి మహత్తర కార్యక్రమం ఇక్కడ కొనసాగడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 236 ప్రత్యేకతలతో 26 వేలకుపైగా దేవతా విగ్రహాల శిల్పాలను మహామేరు ఆలయ నిర్మాణంలో పొందుపర్చడం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుందని కితాబునిచ్చారు.
అద్భుతమైన శిల్పసంపదతో నిర్మించనున్న ఆలయాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నానని మంత్రి హరీష్‌రావు తన్మయం చెందారు. ఇది నాది, అది నాది అనే స్వార్థ చింతనను వదులుకుని ఎదుటి వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకున్నప్పుడే నిజమైన సంతృప్తి లభిస్తుందని చెబుతూ మానత్వంలోనే అసలైన దైవత్వం కనిపిస్తుందని ఉద్భోదించారు. వ్యక్తిగతంగా ఎంత సంపాదించినా అణువంత కూడా వెంటరాదని, కీర్తి ప్రతిష్టలే శాశ్వతంగా నిలుస్తాయని వివరించారు. బృహత్తరమైన ఆలయ నిర్మాణానికి విలువైన స్థలాన్ని హితోధికంగా, ఉచితంగా అందించిన విశ్రాంత తహశీల్దార్ సృజనమ్మ దైవభక్తి వెలకట్టలేనిదని అభినందించారు. దేవాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ఉడతా భక్తిగా తనతో పాటు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా ఉన్నామని వేలాది మంది భక్తుల కరతాళ ధ్వనుల మద్య మంత్రి ప్రకటించారు. డాన్సులు, అర్థం పర్థం లేని పాటలకు స్వస్తి చెప్పి జీవిత గమనాలకు మార్గం చూపించే 108 స్తోత్రాలను వేలాది మంది చేత పాడించడం సమాజానికి శుభ సూచకమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన నిర్వాహకులు మహేశ్వర శర్మ సిద్దాంతితో పాటు ప్రశాంత్, తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి, ఇతర మఠాధిపతులు, పీఠాధిపతులు, యతీశ్వరులు, సంగీత విద్వాంసులు, గాయకులు పాల్గొని భక్తులను అలరింపజేసారు.

*చిత్రం... సంగారెడ్డి మండలం పసల్‌వాది గ్రామ శివారులో నిర్వహించిన స్తోత్ర సమర్పణ కార్యక్రమాన్ని తిలకిస్తున్న మంత్రి హరీష్‌రావు తదితరులు