తెలంగాణ

ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణ కోసం ఒక్కో జిల్లాకు రూ.25 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 10: తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో జిల్లాకో రూ.25 కోట్లతో కొత్తగా పోలీస్ కార్యాలయ భవన నిర్మాణాలు, ట్రెజరీ ఆఫీస్‌ల ఆధునీకరణ, పోలీస్ బలోపేతానికి రూ.375 కోట్లతో కొత్త వాహనాల కొనుగోలుకు కేటాయం చామని, ప్రగతి పథంలో మరో రూ.100 కోట్ల పనులున్నాయని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. ఆదివారం ట్రెజరీ కార్యాలయంలో జరుగుతున్న ఆధునీకరణ పనులను తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేటులోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకో రూ.25 కోట్లతో కొత్త పోలీస్ కార్యాలయాల భవన నిర్మాణాలు, ట్రెజరీల ఆధునీకరణ, ఇతర శాఖల పనులు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్నామని అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ 33 జిల్లాల్లో కొత్త పోలీస్ కార్యాలయాల భవన నిర్మాణాలు, అన్ని జిల్లాల్లో ట్రెజరీ, సబ్ ట్రెజరీ కార్యాలయాల భవన నిర్మాణాలు ఆధునీకరణ పనులకు నిధులను అవసరం మేరకు అందించారన్నారు. ఎక్సైజ్, అటవీ, విద్య, వ్యవసాయ శాఖలలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాల ఆధునీకరణ పనులను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం అప్పగించిందన్నారు. మంజూరైన పనులన్నీ ఆన్‌లైన్ టెండర్ల ద్వారా ఎంపిక చేసి పారదర్శకంగా, నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేస్తున్నామన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయల పనులను కూడా ఆన్‌లైన్ టెండర్ల ద్వారానే చేపడుతున్నామని, జిల్లా ట్రెజరీ ఆఫీస్‌ల ఆధునీకరణకు రూ.28 లక్షలు, సబ్ ట్రెజరీ కార్యాలయాల ఆధునీకరణకు రూ.14 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. కరీంనగర్ జిల్లా ట్రెజరీ అధికారి కార్యాలయం ఆధునీకరణ పనులు పూర్తయ్యాయని, ఫర్నిచర్ ఈ నెలలో సమకూర్చుతామని, డిసెంబర్ మొదటి వారం మంత్రులతో కార్యాలయాలు ప్రారంభించనున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.25 కోట్లతో, రామగుండం పోలీస్ కమిషనర్ ఆఫీస్, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.25 కోట్లు, రూ.3 కోట్లతో ప్రభుత్వ వసతి గృహం రూ.3.60 లక్షలతో వన్ టౌన్ మోడల్ పోలీస్‌స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 13 కొత్త జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాల భవన నిర్మాణ పనులు, పోలీస్ కమిషనర్ కార్యాలయాల నిర్మాణ పనులు కూడా అదే స్పీడుతో జరుగనున్నాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమనే లక్ష్యంతో ప్రభుత్వం పోలీస్‌శాఖను బలోపేతం చేయుటకు రూ.375 కోట్లతో కొత్త వాహనాలు కొనుగోలు చేశారని తెలిపారు. దేశంలోనే 17.7 శాతం జీడీపీతో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు, ఖమ్మంలో సీతారామ్ ప్రాజెక్టు నిర్మాణం, మిషన్ భగీరథ పథకం, 24 గంటల కరెంట్ సరఫరా, రైతుబంధు, రైతు బీమా పథకం, ఆసరా పింఛన్లు తదితర పథకాల అమలుతో భారతదేశంలో బంగారు తెలంగాణ రాష్ట్రంగా దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా ట్రెజరీ ఉపసంచాలకులు శ్రీనివాస్, పోలీస్ హసింగ్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...జిల్లా ట్రెజరీ ఆధునీకరణ పనులను పరిశీలిస్తున్న పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్