తెలంగాణ

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆమరణ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం చర్చలకు పిలవాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తన ఇంటిలో ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేసేందుకు ప్రభుత్వం అనుమతించకపోవటంతో మీర్‌పేట్‌లోని ఊర్మిలానగర్‌లోని తన నివాసంలో దీక్షకు ఉపక్రమించారు. పోలీసులు తనని అరెస్టు చేసినా పోలీసు స్టేషన్‌లో దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు. అశ్వత్థామరెడ్డికి మద్దతుగా ఆర్టీసీ కార్మికులు భారీ ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. కాగా పోలీసులు కూడా భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అశ్వత్థామరెడ్డిని ఏ క్షణానైనా అరెస్టు చేయవచ్చనే భావిస్తున్నారు. ఇప్పటికే జేఏసీ కో-కన్వీనర్ రాజారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు.