క్రైమ్/లీగల్

బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, నవంబర్ 16: బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరిగి సిఐ మొగులయ్య తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పూడూరు మండలం సోమన్‌గుర్తి గ్రామానికి చెందిన బాలిక పరిగిలోని కళాశాలలో చదువుతుంది. పరిగి బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఉండగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వచ్చి బైక్‌పై కళాశాల దగ్గర వదులుతామని చెప్పి పరిగి మండల పరిధిలోని లఖ్నాపూర్ ప్రాజెక్టు సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ పొలంలోకి, ఆ తరువాత వికారాబాద్ తీసుకువెళ్లి అక్కడ కొత్త బట్టలు తీసుకుని సోమన్‌గుర్తి గ్రామానికి తీసుకు వస్తు మరో యువకుడు ఇద్దరు కలిసి అత్యాచారం చేశారు. ఈ విషయం బాలిక తల్లితండ్రులకు సమాచారం ఇవ్వగా, తల్లి తండ్రులు 100 నంబర్‌కు కాల్ చేశారు. బాలిక, తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిఐ మొగులయ్య తెలిపారు.