తెలంగాణ

పంతం వీడండి.. కార్మికులను చర్చలకు పిలవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గిన నేపథ్యంలో వారి ఇతర డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని మాజీ ఎంపీ కొండా విశే్వశ్వరరెడ్డి అన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పంతం మాని చర్చలకు కార్మికులను పిలవాలన్నారు. కఠిన వైఖరిని విడనాడాలన్నారు. 50 వేల మంది కార్మికులకు రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో నానా అగచాట్లు పడుతున్నారన్నారు. కార్మికుల 26 డిమాండ్లు సహజమైనవి, అవేమీ పెద్ద డిమాండ్లు కాదన్నారు. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ తన ప్రణాళికను బహిర్గతం చేయాలన్నారు. ప్రైవేట్ పరం చేస్తామని, 5,100 రూట్లను ప్రైవేటీకరిస్తామని బెదిరింపులు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఇప్పటికే 27 మంది ఆర్టీసీ కార్మికులు మానసిక ఒత్తిడికి లోనై ఆర్థిక పరిస్థితులు విషమించి మరణించారన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తులతో కమిటీ వేసి ఈ సమస్యను పరిష్కరించాలని హైకోర్టు చేసిన సూచనను ప్రభుత్వం తిరస్కరించడం దురదృష్టకరమన్నారు. కార్మికుల జీవితాలతో ఆడుకోరాదని ఆయన కోరారు. కార్మికుల హక్కులు, చట్టపరమైన సర్వీసు రూల్స్ కోసం ప్రతిపాదించిన 26 డిమాండ్లలో ప్రభుత్వంలో విలీనం డిమాండ్‌ను వెనక్కి తీసుకోవడంతో మిగిలిన 25 డిమాండ్లపై చర్చించాలన్నారు. మహిళా ఉద్యోగస్తులకు రాత్రి 9 గంటల తర్వాత డ్యూటీ వేయవద్దని అడగడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. మహిళా కార్మికులు మెటర్నటీ సెలవు అడగడం తప్పా? అని ఆయన అన్నారు. జీహెచ్‌ఎంసీ నుంచి చట్ట ప్రకారం రావలసిన బకాయిలను అడగడం తప్పు ఎలా అవుతుందన్నారు.