తెలంగాణ

ప్రపంచానికి బౌద్ధమే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రపంచ శాంతికి బుద్ధిజమే శరణ్యమని రాష్ట్ర విద్యుత్ మంత్రి జి. జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో రెండు రోజుల నుండి జరుగుతున్న ‘బౌద్ద సంగీతి-2019’ ముగింపు సదస్సులో ఆదివారం ఆయన మాట్లాడారు. థాయిలాండ్, నేపాల్, భూటాన్ తదితర 17 దేశాల నుండి వచ్చిన బౌద్దప్రతినిధులు పాల్గొన్న అంతర్జాతీయ స్థాయి సదస్సు వైభవంగా జరిగింది. శనివారం ప్రారంభమైన సదస్సు ఆదివారం ముగిసింది. సదస్సు ప్రాంగణం ‘బుద్దం శరణం గచ్ఛామి’ అనే నినాదాలతో మారుమోగింది. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బుద్ధిజం వెల్లివిరిసిందని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రజల ఆలోచనలు బౌద్దిజానికి ప్రతీకలు అంటూ అభివర్ణించారు. బౌద్దమతం ప్రారంభం తర్వాత ఇప్పటివరకు గడచిన కాలంలో మధ్యలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, బౌద్దమతం ప్రాశస్త్య తగ్గలేదన్నారు. ఫణిగిరి, వర్దమానకోట, నాగారం, తిరుమలగిరి, చెన్నాయిపాలెంలలో లభించిన అవశేషాలు బౌద్దిజానికి తెలంగాణ ప్రతీక అనేందుకు తార్కాణమన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే జి. కిషోర్‌కుమార్ మాట్లాడుతూ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తుంగతుర్తి నియోజకవర్గంలో బౌద్దారామాలు ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. బౌద్దశిథిలాలు బయటపడ్డ తర్వాత వాటిని కాపాడేందుకు ప్రభుత్వం పరంగా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఆదివారం జరిగిన ముగింపు సదస్సుకు బుద్దవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య అధ్యక్షత వహించగా, ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు మాట్లాడారు.