తెలంగాణ

హెచ్‌పీసీఎల్, ఐవోసీతో ఆర్‌టీసీ ఎంఓయూపై విచారణ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలతో టీఎస్‌ఆర్‌టీసీ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం, నిబంధనలను ఉల్లంఘించి ఆర్టీసీ సంస్థ టీఆర్‌ఎస్ నేతలకు డీలర్‌షిప్‌లను కేటాయించిన విషయమై విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ కేంద్రానికి లేఖ రాశారు. సర్వీసు ప్రొవైడర్ల ముసుగులో టీఆర్‌ఎస్ నేతలకు డీలర్లషిప్‌లను కేటాయిస్తున్నారనే అభియోగాలు వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి విలువైన భూములు ఉన్నాయన్నారు. వనరుల సమీకరణలో భాగంగా ఈ భూములను ఆయిల్ కంపెనీలకు లీజు ఇచరన్నారు. ఇక్కడ వివిధ ప్రాంతాల్లో రిటైల్ అవుట్‌లెట్లను ఇస్తున్నారన్నారు. ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె విషయంలో కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుందని, ఆర్టీసీ కేంద్రం పరిధిలో లేదన్నారు. రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ ముఖ్య కార్యదర్శినా లేక టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శినా అనే అనుమానం కలుగుతోందన్నారు. కోర్టులకు తప్పుడు నివేదికలు ఇవ్వడమేంటన్నారు. కొంత మంది అధికారులు టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష పార్టీలు యూనియన్ నేతలు కలిసి కుట్ర చేశారనడం అవాస్తవమన్నారు. ఇంతకు మించిన జోక్ మరొకటి లేదన్నారు. ఆర్టీసీ సమ్మెను పరిష్కరించలేక ప్రభుత్వం వెన్నులో వణుకుపుడుతుందన్నారు. ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తాను చేస్తున్న తప్పును తెలుసుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికుల కేకలనువినాలని, మొండి పట్టుదలను విడనాడాలని ఆయన హితవుచెప్పారు.