తెలంగాణ

2020 సెలవులివే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను గురువారం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పేరుతో జీఓ (ఆర్‌టీ నెంబర్ 3022) జారీ అయింది. సాధారణ సెలవులుగా 28 పండగలు, జయంతి దినోత్సవాలు, ఉత్సవాల రోజులను ప్రకటించారు. వీటిలో ఐదు పండగలు, జయంతులు ఆదివారం లేదా రెండో శనివారం వచ్చాయి. అలాగే 20 రోజులను ఐచ్ఛిక సెలవులు (ఆప్షనల్ హాలీడేస్) గా ప్రకటించారు. వీటిలో మూడు సెలవులు ఆదివారం రోజు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఈ 20 ఐచ్ఛి క సెలవుల్లో ఏవైనా ఐదు రోజులను సెలవులుగా వాడుకోవ చ్చు. ఈ విధంగా వాడుకునేందుకు ముందుగానే ఉన్నతాధికారుల నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెగోషియేబుల్ ఇన్‌స్ట్రూమెంట్ యాక్ట్, 1881 లోని 25 సెక్షన్ కింద 24 సెలవులను మరో జీఓ (ఆర్‌టీ నెంబర్ 3023) ద్వా రా ప్రకటించారు. నెగోషియేబుల్ ఇన్‌స్ట్రూమెంట్ యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్స్, విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సాధారణ సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 1 కొత్తసంవత్సరం, జనవరి 14 భోగి, 15 సంక్రాంతి, ఫిబ్రవరి 21 శివరాత్రి, మార్చి 9 హోలీ, మార్చి 25 ఉగాది, ఏప్రిల్ 2 శ్రీరామనవమి, ఏప్రిల్ 10 శుభ శుక్రవారం, ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, మార్చి 25 ఈదుల్ ఫితర్ (రంజాన్), 26 రంజాన్ తర్వాతి రోజు, జూలై 20 బోనాలు, ఆగస్టు 1 ఈదుల్ ఆజా (బక్రీద్), 11 శ్రీకృష్ణాష్టమి, 15 స్వాతంత్య్రదినోత్సవం, 22 వినాయక చవితి, అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి, 17 బతుకమ్మ ప్రారంభ దినోత్సవం, 24 దుర్గాష్టమి, 30 ఈద్ మిలాదున్ నబీ, నవంబర్ 30 కార్తీక పూర్ణిమ/గురునానక్ జయంతి, డిసెంబర్ 25 క్రిస్టమస్,
26 బాక్సింగ్ డే లను సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది. రెండోశనివారం, ఆదివారం వస్తున్న సాధారణ సెలవుల వివరాలు-జనవరి 26 గణతంత్ర దినోత్సవం (ఆదివారం), ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్‌రామ్ జయంతి (ఆదివారం), ఆగస్టు 30 షాదత్ ఇమాం హుస్సేన్ మొహరం (ఆదివారం), అక్టోబర్ 25 విజయ దశమి (ఆదివారం), నవంబర్ 14 దీపావళి (రెండో శనివారం).
2020 జనవరి 1 వ తేదీని సెలవుగా ప్రభుత్వం ప్రకటిస్తూ, ఫిబ్రవరి 8 న రెండో శనివారం పనిదినంగా ప్రకటించారు.
ఐచ్ఛిక సెలవులుగా హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జయంతి అయిన జనవరి 10, కనుము జనవరి 16, శ్రీపంచమి జనవరి 30, షాబ్-ఏ-మీరజ్ మార్చి 23, మహావీర్ జయంతి ఏప్రిల్ 6, షాబ్-ఏ-్భరత్ ఏప్రిల్ 9, బుద్దపూర్ణిమ మే 7, షాదత్ హజ్రత్ అలీ మే 14, శబ్-ఏ-ఖదర్ మే 21, జుమా-అతుల్-వాదా మే 22, రథయాత్ర జూన్ 23, వరలక్ష్మివ్రతం జూలై 31, శ్రావణపూర్ణిమ/రాఖీపూర్ణిమ ఆగస్టు 3, తొమ్మిదో మొహర్రం ఆగస్టు 29, అరేబియన్ అక్టోబర్ 8, యాజ్ దాహం శరీఫ్ నవంబర్ 27, క్రిస్టమస్ ఈవ్ డిసెంబర్ 24 తేదీలను ప్రకటించారు. ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించిన బసవ జయంతి ఏప్రిల్ 26, ఈద్-ఏ-ఘదీర్ ఆగస్టు 9, పార్శీ న్యూ ఇయర్ ఆగస్టు 16 దినాలు ఆదివారం వచ్చాయి.
ఇలా ఉండగా నెగోషియేబుల్ ఇన్‌స్ట్రూమెంట్ యాక్ట్ కింద ప్రకటించిన సెలవులు ఇలా ఉన్నాయి. సంక్రాంతి జనవరి 15, మహాశివరాత్రి ఫిబ్రవరి 21, హోళీ మార్చి 3, ఉగాది మార్చి 25, వార్షిక లెక్కల ముగింపు దినోత్సవం ఏప్రిల్ 1, శ్రీరామ నవమి ఏప్రిల్ 2, శుభశుక్రవారం ఏప్రిల్ 10, అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14, మేడే మే 1, రంజాన్ మే 25, బక్రీద్ ఆగస్టు 1, స్వాతంత్య్ర దినోత్సవం 15, మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2, ఈద్ మిలాదున్ నబీ అక్టోబర్ 30, కార్తీక పూర్ణిమ నవంబర్ 30, క్రిస్టమస్ డిసెంబర్ 25 తేదీలను సెలవురోజులుగా ప్రకటించారు. నెగోషియేబుల్ ఇన్‌స్ట్రూమెంట్ యాక్ట్ కింద ప్రకటించిన మరో ఏడు రోజుల సెలవులు రెండోశనివారం, ఆదివారం వచ్చాయి.