తెలంగాణ

రేపు కీలక నిర్ణయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునే విషయంపై గురువారం కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమ్మెపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర మంత్రివర్గం గురు, శుక్రవారం భేటీ కాబోతుంది. వరుసగా రెండు
రోజుల పాటు కేబినెట్ భేటీ కావడం చాలా అరుదు. ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ, రెవెన్యూ చట్టం, శాసనసభ శీతాకాల సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరుపనున్న రెండు రోజుల కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. మంత్రివర్గంలో చర్చించే అంశాలతో పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె విరిమిస్తున్నట్టు చేసిన ప్రకటనపై మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇంచార్జీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్దమని ఇంతకాలంగా చెప్పినా వినిపించుకోకుండా సమ్మెకు దిగి ఎట్టకేలకు బేషరతుగా విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించడంతో, సమ్మెకు ఏ విధంగా ముగింపు పలుకుదామని అధికారులతో సీఎం సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. సమ్మె చట్టబద్ధతపై కార్మిక శాఖ ఇవ్వబోయే తీర్పు, హైకోర్టు చేసిన సూచనల నేపథ్యంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అనే అంశంపై సీఎం ముఖ్యంగా చర్చించినట్టు తెలిసింది. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం వల్ల ప్రజలకు ఎదురైన ఇక్కట్లు, కార్మికుల కుటుంబాలకు ఎదురైన సమస్యలు, యూనియన్లు వ్యవహరించిన తీరు, రాజకీయ పార్టీల జోక్యం తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎప్పుడూ పండుగ రోజుల్లో కార్మికులు సమ్మెకు దిగకపోవడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను శాశ్వతంగా వదులుకోవడం తదితర అంశాలపై కార్మికులతో సమ్మతి పత్రాలు స్వీకరించిన తర్వాతనే విధుల్లో చేర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, 5,200 బస్సులకు అనుమతినిచ్చేందుకు చేపట్టాల్సిన ప్రక్రియపై అధికారులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్టు తెలిసింది. మంత్రివర్గంలో చర్చించే అంశాలపై అజెండా తయారీపై కూడా అధికారులతో చర్చించినట్టు తెలిసింది.
*చిత్రం... హైదరాబాద్‌లో విధుల్లో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను అరెస్టు చే స్తున్న పోలీసులు