తెలంగాణ

సామాన్యులకు ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 26: ప్రభుత్వ విధానాలు సామాన్యులకు చేరి, వారికి అభివృద్ధి ఫలాలు అందినప్పుడే రాజ్యాంగ రూపకల్పనకు నిజమైన ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, అధికారులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన సేవలు అనిర్వచనీయమని అన్నారు. రాజ్యాంగం దేశ పరిపాలనకు సంబంధించిన విధి విధానాలకు, శాంతి భద్రతలకే కాకుండా ప్రతి ఒక్క పౌరుడికీ భద్రత కల్పిస్తుందని అన్నారు. జాతిపిత గాంధీజీని గుర్తుచేసుకుంటూ, రాజ్యాం గం ప్రకారం తీసుకునే ఏ విధానపరమైన నిర్ణయాలైనా, అవి సామాన్యుడికి చేరాలని అన్నారు. యువతలో రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. వాస్తవానికి పౌరులకు రాజ్యాంగం అందిస్తున్న రక్షణకు సంబంధించిన అవగాహన కొరవడిందని, వారిని చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ద్వారా రాజ్యాంగాన్ని, రాజ్యాంగ కర్తలను గౌరవించే సంస్కృతి అందరిలో అలవడుతుందని తమిళిసై పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాజ్యాం గం కల్పించిన హక్కులు, బాధ్యతలతో పాటు మన కర్తవ్యాన్ని కూడా భారత పౌరులుగా విస్మరించుకూడదని
అన్నారు. మరోసారి భారత రాజ్యాంగ స్ఫూర్తికి పునరంకితులు కావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ఏడు దశాబ్దాలుగా పరిపుష్టంగా కొనసాగుతోందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రవేశికను కేవలం ఒక మంత్రంలా జపించకుండా దానిలో పొందుపరిచిన లక్ష్యాలను సాకారం చేసుకోవాలని అన్నారు. ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి సామాన్య ప్రజలకు న్యాయం చేకూర్చే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు హరీష్‌రావు, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, గంగుల ప్రభాకర్, సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, రాజ్‌భవన్ కార్యదర్శి సురేంద్రమోహన్, జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్, డిప్యుటీ సెక్రటరీ రఘుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వేడుకగా రాజ్యాంగ దినోత్సవం
రాష్టవ్య్రాప్తంగా హైకోర్టుతో పాటు అన్ని కోర్టు ప్రాంగణాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే పలు విశ్వవిద్యాలయాల్లో సంవిధాన్ దివస్ నిర్వహించారు. సచివాలయంలో జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్‌సిన్హా రాజ్యాంగ ప్రవేశిక తొలిపలుకులను సిబ్బందితో చదివించారు.
పీఐబీ ఆధ్వర్యంలో
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పీఐబీ రీజనల్ అవుట్‌రీచ్ బ్యూరో ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్సు కాలేజీలో భారత రాజ్యాంగం ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగనుంది. రిజిస్ట్రార్ డాక్టర్ సీహెచ్ గోపాలరెడ్డి జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఐబీ డీజీ ఎస్ వెంకటేశ్వర్, జర్నలిజం ప్రొఫెసర్ కే నాగేశ్వర్, ఆర్ట్సు కాలేజీ ప్రిన్సిపాల్ డీ రవీందర్, ప్రొఫెసర్ స్టీవెన్‌సన్, డీడీ పీ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇఫ్లూలో జరిగిన కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ ఈ సురేష్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖుల ఉపన్యాసాల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.
శాసనసభలో
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాత్మాగాంధీ విగ్రహానికి శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యుటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాగా మహాత్మాగాంధీ లా కాలేజీలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ జీబీ రెడ్డి, లా కాలేజీ కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... రాజభవన్‌లో మంగళవారం జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్య క్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్