తెలంగాణ

ఏజెన్సీపై మావోల గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం, నవంబర్ 26: ములుగు జిల్లా వెంకటాపురం ఎజెన్సీపై మావోయిస్టులు గురి పెట్టారు. వెంకటాపురం, వాజేడు మావోయిస్టు ఏరియా కమిటి పేరుతో ఆదివారం నేతలను టార్గెట్ చేస్తూ లేఖలు విడుదల చేశారు. సోమవారం, మంగళవారం పీ ఎల్‌జీ ఏ 19వ వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం సాయంత్రం వెంకటాపురం-చర్ల రహదారిలో అంకన్నగూడెం, వీరభద్రవరం, విజయపురి కాలనీ ఇతర గ్రామ సరిహద్దుల్లో, ప్రధాన రహదారిపై లేఖలు, కరపత్రాలు వెదజల్లి గాలికి లేచిపోకుండా రాళ్లు సైతం బరువు పెట్టారు. విప్లవోత్సవంతో గ్రామ గ్రామాన యువత ఘనంగా జరుపుకోవాలని చారుమజూందార్ చటర్జీఖరహం భూ స్వామ్య దొపిడి పీడలను దేశాన్ని విముక్తి చేసి 19 సంవత్సరాలు నిండిన సందర్భంగా విప్లవ సూక్తితో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బ్రహ్మణీయ హిందుపాసిజాంకు వ్యతిరేకంగా సభులు, సమావేశాలు, ప్రజా విముక్తి గిరిల్ల సైన్యంతో పాల్గొనాలని లేఖల్లో పేర్కొన్నారు.
పోలీస్ దిగ్బంధంలో వెంకటాపురం సర్కిల్
మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా నేతలను టార్గెట్ చేస్తూ బెదిరింపు లేఖలు, రహదారిపై కర పత్రాలు వెదజల్లడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ప్రత్యేక పోలీసు బలగాలు వెంకటాపురం-వాజేడు సరిహద్దు అటవీ గ్రామాలను జల్లడపడుతున్నాయి. మావోయిస్టు కవ్వింపుచర్యలను పగడ్భంది వ్యూంహంతో పటిష్టమైన భద్రతతో తిప్పికోట్టాలని ములుగు జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల బుట్ల చప్పడు పదఘట్టనలలో గిరిజన గ్రామాలు చిగుటాకుల వనికిపోతున్నాయి. గ్రామాల్లోకి వచ్చేది పోలీసులా, మావోయిస్టుల అని ఆటవీ ప్రాంత ఆదివాసీలు వణికిపోతున్నాయి.
టార్గెట్లు అప్రమత్తం
మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేసిన అధికార పార్టీ నేతలు, ఆదివాసీ సంఘాల నాయకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేయడంతో పలువురు అధికార పార్టీ నేతలు పట్టణాల బాట పట్టినట్లు సమాచారం. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు వారోత్సవాలలో ఎదో ఒక ప్రాంతంలో సంచలనం సృష్టించేందుకు దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు.

*చిత్రం...మావోలు రోడ్డుపై వదిలిన కర పత్రాలు