తెలంగాణ

రాజకీయ నేతలా వ్యవహరిస్తున్న ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 26: ఆర్టీసీ కార్మికుల పట్ల ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని సీపీఐ రాష్టక్రార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరుతున్నామన్నా వారిని విధుల్లోకి తీసుకోబోము అంటూ సునీల్ శర్మ పేర్కొనడం పట్ల చాడ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం హన్మకొండ బాల సముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సునీల్ శర్మ తీరు చూస్తే ఆర్టీసీ ఎండినా లేకా రాజకీయ నాయకుడా అనే అనుమానం కలుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ మాటలనే సునీల్ శర్మ వల్లిస్తున్నాడని, ఒక ఐపీఎస్ అధికారిగా కాకుండా రాజకీయ నాయకుడిగా డూ...డూ బసవన్నలా తల ఊపుతున్నాడని విమర్శించారు. కార్మిక చట్టాల గురించి సునీల్ శర్మ తెలుసుకోవాలని అన్నారు. కార్మికులకు సమ్మె చేసే హక్కు ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కార్మికులు మీ అనుమతి తీసుకొని సమ్మె చేయాలా అని ప్రశ్నించారు. తెలంగాణలో పూర్తిగా పోలీస్ రాజ్యాం నడుస్తున్నదని, ప్రజా స్వామ్యం ఖాఖీ సామ్యంగా మారిందని అన్నారు. 29 మంది ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకున్న సీఎం కేసీఆర్‌కు మానవత్వం లేకుండా పోయిందని అన్నారు. ఒకవైపు హైకోర్టు సూచించిన, మరోవైపు గవర్నర్ చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రయాణీకుల సౌకర్యం కోసం కార్మికులు విధుల్లోకి చేరుతామని వెళితే అరెస్టులకు పాల్పడడం అణిచివేతకు నిదర్శనమని, ఇది కార్మికుల హక్కులను కాలరాయడమేనని చెప్పారు. దీనిపై మేదావులు, ఉద్యోగులు తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఏడుస్తున్నా టీఆర్‌ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కళ్లు తెరవడం లేదంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైనట్టేనన్నారు. కేంద్రం కూడా సమ్మెపై చర్యలు చేపట్టడం లేదని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిచి జాయింట్ మీటింగ్ పెట్టించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతుందని 12వేల పాఠశాలలను కుంటి సాకులతో మూసివేసే చర్యలు చేపట్టారని చాడ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని ప్రైవేటీకరణకు పూనుకుంటున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారు పూర్తి పేద విద్యార్ధులేనని ప్రభుత్వ విద్య పరిరక్షణకు యుద్దం ప్రకటిస్తున్నామని హెచ్చరించారు. తెలంగాణ భూముల పరిరక్షణకై సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతుందని చాడ తెలిపారు. భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో కేసీఆర్ భూకబ్జాకోరలకు అండగా నిలిచారని, తహశీల్ధార్ సజీవ దహనం లాంటి ఘటన తర్వాత రైతులు రెవెన్యూ అధికారుల మద్య యుద్దం జరుగుతుందని స్పష్టమైందన్నారు. మొదట రెవెన్యూ అధికారులను పొగిడిన కేసీఆర్ నేడు వారిని లంచగొండులంటూ తిడుతున్నారని, ఇప్పటికైనా భూ సమస్యలపై రెవెన్యూ నిష్ణాతులను పిలిచి అఖిలపక్ష సమావేశం పెట్టి లోసుగులను సరిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కేళపల్లి శ్రీనివాస్‌రావు, మాజీ ఎమ్మెల్యే పొతరాజు సారయ్య, వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి మేకల రవి తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న చాడ వెంకట్‌రెడ్డి