తెలంగాణ

తెలంగాణలో తొలి ఆధార్ సేవా కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో మొట్టమొదటి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఆధార్) సేవా కేంద్రం హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభమైంది. ఈ కేంద్రం ప్రతిరోజూ 1,000 వరకు వివిధ ఆధార్ సంబంధ అర్జీలను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కేంద్రంలో ఆధార్ గుర్తింపు కార్డులోని పేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్, వేలి ముద్ర, ఫొటో తదితర వాటిని సవరించుకునే, నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆధార్ సేవా కేంద్రంలో సేవలు పొందడానికి ఆన్‌లైన్ ద్వారా అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వారంలో ఏడు రోజులూ ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేస్తుంది. ఐదు నుంచి 15 సంవత్సరాల వయసు లోపుగల
పిల్లలకు ఉచితంగా బయోమెట్రిక్ సేవలు ఈ కేంద్రంలో లభించనున్నాయి. ఇతర సేవలకు మాత్రం నామమాత్రపు రుసుంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరవాసులతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఈ కేంద్రంలో సేవలు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. మాదాపూర్‌లో రిలయన్స్ సైబర్ విల్లే, ప్లాట్ నంబర్ 17 నుంచి 24, విఠల్‌రావునగర్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.