తెలంగాణ

నేడు మంత్రివర్గ కీలక భేటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: ఆర్టీసీ సమ్మె అంశానికి ముగింపు పలికే కీలక నిర్ణయాన్ని గురువారం జరుగనున్న మంత్రివర్గం సమావేశం తీసుకోనుంది. కార్మికుల సమ్మెతో పాటు సగం ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయడంపై కూడా మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది. ఆర్టీసీయే కాకుండా మరో కీలక అంశం కొత్త రెవెన్యూ చట్టంపై కూడా మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది. ప్రగతిభవన్‌లో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రారంభం కానున్న మంత్రిమండలి సమావేశం, తిరిగి శుక్రవారం కూడా కొనసాగనున్నట్టు సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌లో నిర్వహించాల్సి ఉంది. ఆ సందర్భంగా రెవెన్యూ చట్టాన్ని సవరించి, దాని స్థానంలో కొత్త రెవెన్యూ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే చట్టంగా ఆమోదించాల్సి ఉంది. ఈ అంశంపై కూడా మంత్రిమండలి చర్చించనున్నట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికలకు కూడా హైకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సమావేశం దీనిపై కూడా చర్చించనుంది. పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో మంత్రిమండలిని శుక్రవారం రెండవ రోజు కూడా కొనసాగించనున్నట్టు పేర్కొన్నారు. మంత్రిమండలి సమావేశం వరుసగా రెండు రోజుల పాటు జరగడం చాలా అరుదైన విషయం.