తెలంగాణ

పంచాయతీలకు వచ్చే కేంద్ర నిధులు పక్కదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ, నవంబర్ 27: కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో నేరుగా గ్రామపంచాయతీలకు విడుదల చేస్తున్న నిధులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించి ఇతర వాటికి వాడుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో మరికల్ మండల బీజేపీ ఆధ్వర్యంలో రాంచందర్‌రావుకు ఘన స్వాగతం పాలికారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లకోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పట్టించుకోవాడం లేదన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు దాదాపు 50 వేలకు పైగా ఉన్నారని ఆయన గుర్తుచేశారు. కార్మికుల ప్రాణాలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెలగటం ఆడుతోందన్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు మృతి చెందినా నేటికీ వారి కుటుంబాలను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. విధులలోకి చేరుతామని వెళ్లిన ఆర్టీసీ కార్మికులను పోలీసులతోగెంటించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు అండగా బీజేపీ ఉంటుందని ఆయన హామీనిచ్చారు. ఆర్టీసీ కార్మికులను వెంటనే విధులలోకి చేర్చుకునే వరకు ఆందోళనలు తప్పవన్నారు. అనంతరం మరికల్ మండల బీజేపీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, నారాయణపేట నియోజకవర్గ ఇన్‌చార్జి కె.నర్సన్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావును శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రాంచందర్‌రావు