తెలంగాణ

విధుల్లో చేరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: ఆర్టీసీ కార్మికులకు ఊరట లభించింది. విధుల్లో చేరడానికి పిలుపు వచ్చింది. 55 రోజులుగా సాగిన సమ్మె సుఖాంతమైంది. సమస్యకు ప్రభుత్వం ముగింపు పలికింది. సమ్మెలో ఉన్న కార్మికులు శుక్రవారం ఉదయం నుంచి వచ్చి డ్యూటీలో చేరాల్సిందిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. విధు ల్లో చేరేందుకు ఎలాంటి షరతులు విధించడం లేదని కూడా సీఎం స్పష్టం చేశారు. సమ్మె సందర్భంగా చనిపోయిన కార్మికుల కుటుంబాల్లోని ఒక్కరికి ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే ఆర్టీసీ ప్రైవేట్‌పరం చేసే ఆలోచన కూడా ఇప్పట్లో లేదని సీఎం హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు చెప్పిన సీఎం ప్రజలకు మాత్రం కాస్త ఓ చేదు కబురు చెప్పారు. ఆర్టీసీ నష్టాల నుంచి గట్టేక్కించడానికి సోమవారం నుంచే కిలో మీటరుకు రూ. 20 పైసల చొప్పున చార్జీలు పెంచబోతున్నట్టు ప్రకటించారు. అలాగే ఆర్టీసీని ఆదుకోవడానికి తక్షణ సహాయంగా రూ. 100 కోట్లు తక్షణం విడుదల చేస్తున్నట్టు సీఎం వెల్లడించారు. ప్రగతిభవన్‌లో గురువారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలిలో ఆర్టీసీపై తీసుకున్న నిర్ణయాలను మీడియాకు స్వయంగా వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల ఉన్మాదంలో, రాజకీయ పార్టీల మాయలోపడి బతుకులు బజారు పాల్జేసుకోవద్దని కూడా సీఎం హితవు పలికారు. ఆర్టీసీని ఎట్టిపరిస్థితిలో కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలన్న ఆలోచనేమి ప్రస్తుతానికి లేదన్నారు. అలా చేయాల్సి వస్తే కార్మికులతో చర్చించే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘ఇప్పటికీ చెబుతున్నా,
ఆర్టీసీ సమ్మె వందకు వందశాతం చట్ట విరుద్ధం, ఆనాలోచిత చర్య’ అని సీఎం పునరుద్ఘాటించారు. యూనియన్ల మాయ, ఉన్మాదంలో పడి కార్మికులు ఎంతో నష్టపోయారని, వారి బాధలు చూస్తే ఎంతో బాధేసిందన్నారు. యూనియన్ల మాటలు పట్టుకొని వెళ్తే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టే’ అని సీఎం హెచ్చరించారు. తాము పొట్ట నింపేవాళ్లమై తప్ప కొట్టేవాళ్లం కాదని సీఎం అన్నారు. యూనియనే్లమో తమ మనుగడ కోసం, రాజకీయ పార్టీలేమో తమ చిల్లర రాజకీయాల కోసం ఆర్టీసీ కార్మికులను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వాళ్లదేముంది, టెంటు కనిపిస్తే రెచ్చగోట్టేలా మాట్లాడి వెళ్లడం తప్ప వాళ్లేమైనా ఆర్చేవాళ్లా, తీర్చేవాళ్లా?’ అని సీఎం ప్రశ్నించారు. ఏదైనా మంచి చేయాలన్నా అది తామేనన్నారు. ‘మీ గురించి ఎవరైనా ఆలోచించారా? నిజానికి అది ఆలోచించింది నేను.. హైకోర్టు చీఫ్ జస్టిస్ మాత్రమే’ అని సీఎం వివరించారు. ఇటీవల రాజ్‌భవన్‌లో చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ కలిసినప్పుడు ‘ఆర్టీసీ వాళ్లు చాలా పూర్ వర్కర్స్, వాళ్ల గురించి ఆలోచించండి’ అని తనకు సూచించినట్టు సీఎం వివరించారు. సమ్మె చట్టవిరుద్ధమనే విషయాన్ని కార్మిక శాఖ తేల్చాల్సిన అవసరమేమీ లేదని, అది ముమ్మాటికీ చట్టవిర్దుమేనని అన్నారు. ‘మీకు నష్టం కలిగించే వాళ్లమైతే మళ్లీ ఎవరికి ఉద్యోగాలు వచ్చేవి కాదు’ అని వ్యాఖ్యానించారు. వారం రోజుల్లో ప్రతి డిపోకు ఐదుగురు సీనియర్ కార్మికులను ప్రగతిభవన్‌కు పిలిపించి ఆర్టీసీ ప్రస్తుతస్థితి, భవిష్యత్తు, గట్టేక్కించడానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర విషయాలపై చర్చించనున్నట్టు సీఎం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అందరి కడుపులు నింపిన తమకు ఆర్టీసీ కార్మికుల పట్ల ఎలాంటి కోపం లేదన్నారు. వాళ్లు కూడా తమ బిడ్డలేనని, అయితే యూనియన్ల ఉన్మాదంలో పడి సమ్మె చేసి ఎన్నో బాధలు పడాల్సి వచ్చిందన్నారు. ఆర్టీసీకే కాదు టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ రంగాలకు చెందిన వారికి దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా జీతాలు పెంచి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని అన్నారు. అంగన్‌వాడీలు, హోంగార్డులు, ఆశా వర్కర్లకు జీతాలను దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఎక్కువ చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. అలాగే బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు ఎక్కడా పెన్షన్ ఇవ్వడం లేదని తాము మాత్రమే ఇస్తున్నామని అన్నారు.
*చిత్రం... ముఖ్యమంత్రి కేసీఆర్