తెలంగాణ

మాజీ సీజే బాలకృష్ణన్‌కు ఈశ్వరీబాయి పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాజీలేని పోరాటం చేసిన ధీర వనిత ఈశ్వరీ బాయి అని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈశ్వరీబాయి జయంతిని పురస్కరించుకొని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్‌కు ఈశ్వరీ బాయి సార్మక అవార్డును గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రదానం చేశారు. రవీంద్రభారతిలో ఆదివారం సాయంత్రం ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా
దతాత్రేయ ప్రసంగిస్తూ బడుగు, బలహీన వర్గాల ప్రజల తరఫున జీవితాంతం ఈశ్వరీబాయి పోరాటం చేశారని కొనియాడారు. వర్తమాన రాజకీయాల్లో నైతిక విలువలు పతనం అవుతున్నాయని దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. ఈశ్వరీ బాయి తాను నమ్మిన సిద్ధాంతల కోసం అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఈశ్వరీబాయి రాజకీయ జీవితాన్ని ఈ తరం నాయకులు స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. భావితరాలకు ఈశ్వరీబాయి జీవిత చరిత్రను తెలియజేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. హోం మంత్రి మహమూద్ అలీ, సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్యక్రమంలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఈశ్వరీబాయి ప్రస్థానంపై సంక్షిప్త చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ సలహాదారుడు డా. కేవీ రమణాచారి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

*చిత్రం...ఈశ్వరీబాయి స్మారక అవార్డును సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్‌కు ప్రదానం చేస్తున్న హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ